తెలుగు న్యూస్ / ఫోటో /
TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇంటి నమూనా వచ్చేసింది - ఇవిగో ఫొటోలు
- TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మొబైల్ యాప్ ను ఆవిష్కరించటంతో పాటు ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ముఖ్య వివరాలను పేర్కొంది.
- TG Indiramma Housing Scheme Updates : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ సర్కార్ మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మొబైల్ యాప్ ను ఆవిష్కరించటంతో పాటు ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ముఖ్య వివరాలను పేర్కొంది.
(1 / 6)
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. అంతేకాకుండా… ఇందిరమ్మ ఇంటి నమూనాను కూడా విడుదల చేసింది.
(2 / 6)
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి లోపాలు లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
(3 / 6)
గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాప్ ను ఆవిష్కరించారు. ఇంటి నమూనాలతో పాటు యాప్ పని తీరును పరిశీలించారు.
(4 / 6)
తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 4.5 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను ధపాలు వారీగా ఇస్తారు.
(5 / 6)
లబ్ధిదారులకు మరో వెసులుబాటును కూడా సర్కార్ కల్పించింది. ప్రభుత్వం అందించే 400 చదరపు అడుగుల డిజైన్ ను అనుసరించాల్సిన పని లేదు. ఇంకా స్థలం కలిగి ఉంటే 500 చదరపు అడుగుల్లోనూ ఇల్లు కట్టుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
ఇతర గ్యాలరీలు