చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్! డబ్ల్యూటీసీలో అతడే నంబర్ వన్.. ఇండియా భారీ స్కోరు-indian test captain shubman gill creates history most centuries in world test championship by indian batter rohit sharma ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్! డబ్ల్యూటీసీలో అతడే నంబర్ వన్.. ఇండియా భారీ స్కోరు

చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్! డబ్ల్యూటీసీలో అతడే నంబర్ వన్.. ఇండియా భారీ స్కోరు

Published Oct 11, 2025 01:59 PM IST Chandu Shanigarapu
Published Oct 11, 2025 01:59 PM IST

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ బాదిన ఈ ఇండియన్ కెప్టెన్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ రికార్డును బ్రేక్ చేశాడు.

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో 10వ సెంచరీ. ఈ సెంచరీతో గిల్ WTCలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 9 సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అతను అధిగమించాడు. వీరి తర్వాత జైస్వాల్ పేరిట 7, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేరిట 6 చొప్పున సెంచరీలు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ ఇప్పుడు WTC చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌ జాబితాలో చేరాడు.

(1 / 6)

(AFP)

WTC చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డు ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ పేరిట ఉంది. అతను ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 21 సెంచరీలు చేశాడు.

(2 / 6)

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 13 సెంచరీలతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతనికి, జో రూట్‌కు మధ్య 8 సెంచరీల తేడా ఉంది.

(3 / 6)

WTC చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన ఈ ఆటగాడి పేరిట ఈ టోర్నమెంట్‌లో 11 సెంచరీలు ఉన్నాయి.

(4 / 6)

ఆస్ట్రేలియాకు చెందిన మరో బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. అతను కూడా కేన్ విలియమ్సన్‌తో సమానంగా 11 సెంచరీలు చేశాడు.

(5 / 6)

వెస్టిండీస్ తో రెండో టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. 518/5 దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్ మన్ గిల్ (129 నాటౌట్) భారీ సెంచరీలు బాదారు.

(6 / 6)

(PTI)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు