
(1 / 5)
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి సత్తాచాటింది. అద్భుతమైన బ్యాటింగ్ తో శ్రీలంకపై సెంచరీ బాదేసింది. సంచలన ఇన్నింగ్స్ తో అదరగొట్టింది.
(x/bcciwomen)
(2 / 5)
ఆదివారం (మే 11) కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న వన్టే ట్రై సిరీస్ ఫైనల్లో మంధాన చెలరేగిపోయింది. ఈ ఓపెనర్ 101 బంతుల్లో 116 పరుగులు చేసింది. 15 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టింది.
(x/bcciwomen)
(3 / 5)
శ్రీలంకపై సెంచరీతో మంధాన రికార్డు క్రియేట్ చేసింది. వన్డేల్లో ఆమెకు ఇది 11వ హండ్రెడ్. వుమెన్ వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో మంధాన మూడో ప్లేస్ కు చేరుకుంది.
(x/bcciwomen)
(4 / 5)
వుమెన్ వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ (15) పేరు మీద ఉంది. సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా లెజెండ్ మెగ్ లానింగ్ (13) ఉంది. ఇప్పుడు బీమాంట్ (10)ను దాటి మంధాన మూడో ప్లేస్ కు చేరుకుంది.
(x/bcciwomen)
(5 / 5)
ఇప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత మహిళా బ్యాటర్ గా కొనసాగుతున్న మంధాన.. 102 మ్యాచ్ ల్లో 4473 పరుగులు చేసింది. 11 సెంచరీలు ఖాతాలో వేసుకుంది.
(x/bcciwomen)ఇతర గ్యాలరీలు