(1 / 5)
ఇండియన్ స్టార్ స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ ఎంగేజ్ మెంట్ జరిగింది. చిన్ననాటి ఫ్రెండ్ వంశికతో అతని నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
(PTI)(2 / 5)
బుధవారం (జూన్ 4) లక్నోలో అత్యంత సన్నిహితులు సమక్షంలో కుల్ దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కుల్ దీప్, వంశిక మెరిసిపోయారు.
(PTI)(3 / 5)
రింగ్ లు మార్చుకున్న కుల్ దీప్ యాదవ్, వంశిక సంతోషంలో మునిగిపోయారు. ఇలా నవ్వులు చిందిస్తూ సెల్పీ తీసుకున్నారు. లక్నోలోని శ్యామ్ నగర్ కు చెందిన వంశిక ఎల్ఐసీలో పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.
(PTI)(4 / 5)
కుల్ దీప్, వంశిక ఎంగేజ్ మెంట్ వేడుకకు టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ అటెండ్ అయ్యాడు. కుల్ దీప్, వంశిక జోడీకి శుభాకాంక్షలు తెలిపాడు.
(PTI)(5 / 5)
ఎంపీ ప్రియ సరోజ్ కూడా కుల్ దీప్, వంశిక ఎంగేజ్ మెంట్ వేడుకకు హాజరైంది. రింకు సింగ్, ప్రియ సరోజ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లాండ్ టూర్ కు టీమిండియాకు కుల్ దీప్ ఎంపికయ్యాడు.
(x/PriyaSarojMP)ఇతర గ్యాలరీలు