(1 / 5)
భారత యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ గతేడాది 2024లో టీ20ల్లో అదరగొట్టాడు. అద్భుత బౌలింగ్ చేశాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ టైటిల్‍ను టీమిండియా కైవసం చేసుకోవడంలో ఓ కీలకపాత్ర పోషించాడు. దీంతో అర్షదీప్‍కు ఐసీసీ అవార్డు దక్కింది.
(REUTERS)(2 / 5)
2024కు గాను ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అర్షదీప్ సింగ్ దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నేడు (జనవరి 25) వెల్లడించింది. 2024లో టీ20ల్లో అదరగొట్టిన అర్షదీప్‍ను అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రకటించింది.
(AFP)(3 / 5)
పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ఇది ఇయర్ 2024కు అర్షదీప్‍తో పాటు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్, జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా కూడా నామినేట్ అయ్యారు. రేసులో ముగ్గురినీ ఓడించి 2024కు గాను ఐసీసీ అత్యుత్తుమ టీ20 క్రికెటర్ అవార్డు కైవసం చేసుకున్నాడు అర్షదీప్ సింగ్.
(AP)(4 / 5)
2024లో 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍లు ఆడిన అర్షదీప్ సింగ్.. 36 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్‍లో కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. టీమిండియా గెలుపుల్లో కీలకపాత్ర పోషించాడు. పవర్ ప్లేలో తన మార్క్ స్వింగ్ బంతులతో వికెట్లు తీసి సత్తాచాటాడు. 10.08 వికెట్ స్ట్రైక్ రేట్‍తో అదరగొట్టాడు.
(AP)(5 / 5)
ఇప్పటి వరకు భారత్ తరఫున 61 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍ల్లో 97 వికెట్లు పడగొట్టాడు అర్షదీప్ సింగ్. మరో మూడు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి టీమిండియా బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు.
(AFP)ఇతర గ్యాలరీలు