
(1 / 5)
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఛాంపియన్ జట్టులాగా ఆడుతోంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ ను చిత్తు చేసిన భారత్.. సెమీస్ లో ఆస్ట్రేలియా గండాన్ని దాటింది. ఇంకో విజయం సాధిస్తే చాలు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలుస్తుంది.
(AFP)
(2 / 5)
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ టైటిల్ విజేతగా నిలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ముఖ్యంగా సెమీస్ లో ఆసీస్ ను ఓడించడంతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. కంగారూ జట్టుపై టీమ్ ప్రదర్శనతో అభిమానుల్లో మరింత నమ్మకం వచ్చింది.
(Surjeet Yadav)
(3 / 5)
బ్యాటింగ్ లో భారత్ అదరగొడుతోంది. ముఖ్యంగా శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ సంచలన ఫామ్ లో ఉన్నారు. 72.33 సగటుతో కోహ్లి 217 పరుగులు చేశాడు. పాకిస్థాన్ పై సెంచరీ కొట్టాడు. శ్రేయస్ 195 పరుగులు సాధించాడు. గిల్ 157 పరుగులు రాబట్టాడు. బంగ్లాదేశ్ పై సెంచరీ నమోదు చేశాడు.
(AFP)
(4 / 5)
బౌలింగ్ లోనూ టీమిండియాకు ఎదురు లేదు. దుబాయ్ అంతర్జాతీయ పిచ్ పై నలుగురు స్పిన్నర్లను ఆడిస్తూ ప్రత్యర్థి జట్లను చుట్టేస్తోంది. వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా స్పిన్ తో సత్తాచాటుతున్నారు. రెండు మ్యాచ్ లే ఆడిన వరుణ్ 7 వికెట్లు తీశాడు. మరోవైపు పేసర్ షమి సత్తాచాటుతున్నాడు. 4 ఇన్నింగ్స్ ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.
(PTI)
(5 / 5)
ఇక టీమిండియా కలిసికట్టుగా అదరగొడుతోంది. జట్టు ఆటగాళ్లు ఒక్కటిగా కలిసిపోయారు. ఒకరిని మరొకరు ఎంకరేజ్ చేసుకుంటూ సాగుతున్నారు. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు రోహిత్, కోహ్లి, షమి తమ ప్రదర్శనతో జట్టులో స్ఫూర్తి నింపుతున్నారు. ఫైనల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తే ట్రోఫీ భారత్ చేతికి చిక్కినట్లే.
(BCCI - X)ఇతర గ్యాలరీలు