Rohit Sharma: రోహిత్.. రిటైర్ అయిపో: సోషల్ మీడియాలో హిట్‍మ్యాన్‍పై ట్రోలింగ్
- Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే.
- Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే.
(1 / 6)
భారత కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‍తో టెస్టు సిరీస్‍లో మరోసారి విఫలమయ్యాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా.. నేడు (అక్టోబర్ 26) రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకు ఔటయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో కొందరు భారత క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతడిని ట్రోల్ చేస్తున్నారు.
(AFP)(2 / 6)
టెస్టుల్లో గత ఎనిమిది ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఆరుసార్లు సింగిల్ డిజిట్‍కే పరిమితం అయ్యాడు. ఫామ్ కోల్పోయాడు. దీంతో రోహిత్ శర్మ ఇక టెస్టుల నుంచి రిటైర్ అవ్వాలంటూ నేడు కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
(AP)(3 / 6)
రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్ అవ్వాలనే విషయం సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో నేడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ విషయం గురించి చాలా మంది నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. చాలా ఏళ్లుగా రోహిత్ భారత్‍కు అద్భుతంగా ఆడుతున్నారని, అయితే టెస్టులకు ఇప్పుడు రిటైర్ అయ్యే టైమ్ వచ్చిందంటూ కొందరు సూచనలు ఇస్తున్నారు.
(PTI)(4 / 6)
రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటిదార్, అభిమన్యు ఈశ్వరన్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్ కాబట్టే టెస్టుల్లో రోహిత్ చోటు దక్కించుకుంటున్నారంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.
(5 / 6)
లెజెండ్ రేంజ్ ఉన్న రోహిత్ శర్మను అప్పుడే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలనడం సరికాదని, మళ్లీ ఫామ్‍లోకి వస్తాడని అతడి అభిమానులు కొందరు మద్దతు తెలుపుతున్నారు. మొత్తంగా న్యూజిలాండ్ సిరీస్‍లో రోహిత్ శర్మ వైఫల్యం ఆందోళనగా మారింది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ హిట్‍మ్యాన్‍కు అత్యంత కీలకంగా ఉండనుంది.
(AFP)ఇతర గ్యాలరీలు