Deepika Padukone: సినిమాల్లోకి రాకముందు క్రీడాకారులుగా పేరు తెచ్చుకున్న హీరో హీరోయిన్స్- దీపికా నుంచి అమీర్ ఖాన్ వరకు!
Indian Celebrities Who Play Sports Before Movies: సినిమాల్లోకి రాకముందు చాలా మంది హీరో హీరోయిన్స్ ఏదో ఒక రంగంలో పనిచేసేవారు. కొంతమంది కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు. మరికొంతమంది క్రీడల్లో రాణించారు. మరి సినిమాల్లోకి రాకముందు క్రీడాకారులుగా పేరు తెచ్చుకున్న భారతీయ హీరో హీరోయిన్స్ ఎవరో లుక్కేద్దాం.
(1 / 10)
బాలీవుడ్‌లో కూడా కొంతమంది నటులు, నటీమణులు నటనారంగంలోకి రాకముందు క్రీడల్లో పేరు తెచ్చుకున్నారు. వారిలో కొంతమంది జాతీయ స్థాయిలో కూడా ఆడారు. వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.
(instagram)(2 / 10)
బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణుడు. ఇంకా ఆయన టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు.
(instagram)(3 / 10)
సినిమాల్లోకి రాకముందు దీపికా పదుకొనే బ్యాడ్మింటన్ ఆడేవారు. జాతీయ స్థాయిలో కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆమె తండ్రి ప్రకాష్ పదుకొనే కూడా ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు అని తెలిసిందే.
(instagram)(4 / 10)
అమీర్ ఖాన్ టెన్నిస్ ఆటగాడిగా గుర్తింపు పొందారు. మహారాష్ట్ర స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో ఆయన పాల్గొన్నారు.
(instagram)(5 / 10)
రాహుల్ బోస్ మంచి నటుడు మాత్రమే కాదు, మంచి రగ్బీ ఆటగాడు కూడా. ఆయన రగ్బీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2009లో రగ్బీ ఆడటం మానేశారు. ఇటీవల అమరన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ బోస్.
(instagram)(6 / 10)
నీతూ చంద్ర టైక్వాండోలో 5 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించారు. అంతేకాకుండా, బీహార్‌కు బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, నెట్‌బాల్ ఆడారు. అలాగే, బీహార్ ప్రభుత్వ ఖేల్ సమ్మాన్ అవార్డును కూడా అందుకున్నారు.
(instagram)(7 / 10)
బాలీవుడ్ యాక్టర్ సాకిబ్ సలీం సినిమాల్లో తన ప్రతిభను చూపించకముందు రాష్ట్ర స్థాయి క్రికెట్ ఆటగాడిగా గుర్తింపు పొందారు.
(instagram)(8 / 10)
బాలీవుడ్ టాప్ యాక్టర్స్‌లలో రణదీప్ హుడా ఒకరు. అతను మంచి నటుడు మాత్రమే కాకుండా పోలో ఆటగాడిగా కూడా గుర్తింపు పొందారు.
(instagram)(9 / 10)
ఇటీవల అభిషేక్ బచ్చన్ ఘూమర్ సినిమాలో నటించిన సయామీ ఖేర్ అథ్లెట్‌గా గుర్తింపు పొందారు. బ్యాడ్మింటన్, టెన్నిస్ కూడా ఆడారు.
(instagram)ఇతర గ్యాలరీలు