IPL Orange Cap Indian Batters: ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ అందుకున్న భారత ఆటగాళ్లు ఎవరో తెలుసా? లిస్ట్ లో సచిన్ కూడా
- IPL Orange Cap Indian Batters: ఐపీఎల్ కిక్ ఫ్యాన్స్ ను ఊపేస్తోంది. ఈ లీగ్ లో ప్రతి ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంటాడు. మరి 17 ఐపీఎల్ సీజన్లలో ఎంతమంది ఇండియన్ ప్లేయర్లు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారో తెలుసా? ఈ లిస్ట్ లో లెెజెండ్ సచిన్ కూడా ఉన్నాడు.
- IPL Orange Cap Indian Batters: ఐపీఎల్ కిక్ ఫ్యాన్స్ ను ఊపేస్తోంది. ఈ లీగ్ లో ప్రతి ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంటాడు. మరి 17 ఐపీఎల్ సీజన్లలో ఎంతమంది ఇండియన్ ప్లేయర్లు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారో తెలుసా? ఈ లిస్ట్ లో లెెజెండ్ సచిన్ కూడా ఉన్నాడు.
(1 / 6)
ఫార్మాట్ తో పనిలేకుండా క్లాస్ ఆటతీరుతో అదరగొట్టే సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ లోనూ అదరగొట్టాడు. 2010 సీజన్ లో ముంబయి ఇండియన్స్ కు ఆడిన సచిన్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఆ సీజన్ లో 15 మ్యాచ్ ల్లో 618 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ అతడే.
(Sportzpics for IML)(2 / 6)
అంతర్జాతీయ క్రికెటైనా.. ఐపీఎల్ అయినా విరాట్ కోహ్లి పరుగుల వేట కొనసాగుతూనే ఉంటోంది. ఈ స్టార్ బ్యాటర్ రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఆర్సీబీ తరపున 2016లో 973 పరుగులు చేసిన కింగ్ కోహ్లి.. 2024లో 741 పరుగులు సాధించాడు.
(PTI)(3 / 6)
టీమిండియా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న శుభ్ మన్ గిల్ 2023 ఐపీఎల్ సీజన్లో అదరగొట్టాడు. ఈ గుజరాత్ టైటాన్స్ ఆటగాడు ఆ సీజన్ లో 17 మ్యాచ్ ల్లో 890 పరుగులు సాధించాడు.
(PTI)(4 / 6)
టీమిండియా క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కు కూడా ఐపీఎల్ లో మెరుగైన రికార్డుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడాడు. ఆ సీజన్ లో 14 మ్యాచ్ ల్లో 670 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
(PTI)(5 / 6)
ప్రస్తుత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఐపీఎల్ నుంచి వెలుగులోకి వచ్చినవాడే. ఈ ఆటగాడు 2021 ఐపీఎల్ లో అదరగొట్టాడు. సీఎస్కే తరపున 16 మ్యాచ్ ల్లో 635 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.
(PTI)ఇతర గ్యాలరీలు