(1 / 4)
రియో డి జనీరోలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా భారత్, చైనా విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. సరిహద్దు సమస్య, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు, వీసాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చర్చించారు. సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల సమావేశానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
(Dr. S. Jaishankar-X)(2 / 4)
లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ నుంచి బలగాల ఉపసంహరణ తర్వాత చైనా, భారత్ విదేశాంగ మంత్రుల మధ్య జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. సోమవారం రియో డి జనీరోలో ఈ సమావేశం జరిగింది. భారత్- చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు. బలగాల ఉపసంహరణ వల్ల ఆ ప్రాంతంలో శాంతి నెలకొనడానికి దోహదపడిందని ఇరువురు నేతలు అంగీకరించారు.
(AFP)(3 / 4)
(4 / 4)
వీలైనంత త్వరగా వీసాల సడలింపు అంశాన్ని వాంగ్ లేవనెత్తారని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సంబంధాలను సుస్థిరం చేసుకోవడం, విభేదాలను పరిష్కరించడం, తదుపరి చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని ఇద్దరు మంత్రులు అంగీకరించారు.
(Dr. S. Jaishankar-X)ఇతర గ్యాలరీలు