CWG 2022 Day 2 in Pics: రెండో రోజు ఇండియాకు నాలుగు మెడల్స్.. గోల్డెన్ వుమన్ చాను-india win 4 medals on day 2 of commonwealth games 2022 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cwg 2022 Day 2 In Pics: రెండో రోజు ఇండియాకు నాలుగు మెడల్స్.. గోల్డెన్ వుమన్ చాను

CWG 2022 Day 2 in Pics: రెండో రోజు ఇండియాకు నాలుగు మెడల్స్.. గోల్డెన్ వుమన్ చాను

Updated Jul 31, 2022 09:31 AM IST Hari Prasad S
Updated Jul 31, 2022 09:31 AM IST

  • CWG 2022 Day 2 in Pics: కామన్వెల్త్‌ గేమ్స్‌ రెండో రోజు ఇండియా అదరగొట్టింది. వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండించారు. దీంతో రెండో రోజు మొత్తం నాలుగు మెడల్స్‌ ఇండియా ఖాతాలో చేరాయి. అందులో ఒక గోల్డ్‌, రెండు సిల్వర్‌, ఒక బ్రాంజ్‌ మెడల్‌ ఉన్నాయి. మీరాబాయికి గోల్డ్‌, సంకేత్‌ మహదేవ్, బింద్యారాణి దేవిలకు సిల్వర్‌, గురురాజ పూజారికి బ్రాంజ్‌ మెడల్‌ వచ్చాయి.

CWG 2022 Day 2 in Pics: ఒలింపిక్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ మీరాబాయి చాను కామన్వెల్త్‌ గేమ్స్‌లో హ్యాట్రిక్‌ సాధించింది. ఆమె 49 కేజీల కేటగిరీలో గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. మొత్తం 201 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డు నెలకొల్పింది. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 113 కేజీలు ఎత్తడం విశేషం. స్నాచ్‌లో ఆమెకిదే పర్సనల్‌ బెస్ట్‌.

(1 / 6)

(PTI)

CWG 2022 Day 2 in Pics: ఇక మహిళల 55 కేజీల విభాగంలో బింద్రాయనీ దేవి సిల్వర్‌ మెడల్‌ గెలుచుకుంది. ఆమె మొత్తం 202 కేజీల బరువు ఎత్తి రెండోస్థానంలో నిలిచింది. చివరి అటెంప్ట్‌లో క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 116 కేజీల బరువు ఎత్తడంతో బ్రాంజ్‌ నుంచి సిల్వర్‌కు దూసుకెళ్లింది. ఒక్క కేజీ తేడాతో బింద్రాయనీ గోల్డ్‌ కోల్పోయింది.

(2 / 6)

(AP)

CWG 2022 Day 2 in Pics: ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియాకు తొలి మెడల్‌ అందించాడు సంకేత్‌ మహదేవ్‌ సర్గర్‌. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్‌ మొత్తం 248 కేజీలు ఎత్తాడు. చివర్లో తన భుజానికి గాయం కావడంతో గోల్డ్‌ గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. అది కూడా కేవలం ఒక్క కేజీ తేడాతోనే కావడం విశేషం. సంకేత్‌ స్నాచ్‌లో 113, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 135 కిలోలు ఎత్తాడు.

(3 / 6)

(Team India twitter)

CWG 2022 Day 2 in Pics: ఇక ఇండియాకు మరో బ్రాంజ్‌ మెడల్‌ అందించాడు 61 కేజీల కేటగిరీలో వెయిట్‌లిఫ్టర్‌ గురురాజ పూజారి. అతడు మొత్తంగా 269 కేజీలు ఎత్తి బ్రాంజ్‌ గెలిచాడు. స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 151 కేజీలు ఎత్తాడు.

(4 / 6)

CWG 2022 Day 2 in Pics: కామన్వెల్త్‌ గేమ్స్‌ రెండో రోజు బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. ఇప్పటికే శ్రీలంక, ఆస్ట్రేలియాలపై సునాయాస విజయాలు సాధించిన ఇండియన్‌ టీమ్‌.. మెడల్‌ వైపు దూసుకెళ్తోంది.

(5 / 6)

CWG 2022 Day 2 in Pics: అటు టేబుల్‌ టెన్నిస్‌లో ఇండియన్‌ అథ్లెట్లు గ్రూప్‌ స్టేజ్‌లో సునాయాస విజయాలు సాధించారు. పురుషుల, మహిళల టీమ్స్‌ గెలిచాయి. వుమెన్స్‌ టీమ్‌ గయానాపై 3-0తో గెలవగా.. మెన్స్‌ టీమ్‌ కూడా నార్తర్న్‌ ఐర్లాండ్‌పై 3-0తోనే గెలిచాయి.

(6 / 6)

(REUTERS)

ఇతర గ్యాలరీలు