IND vs PAK Live Streaming: భారత్, పాక్ హైవోల్టేజ్ పోరు.. గెలిస్తే సెమీస్‍కు టీమిండియా.. మ్యాచ్ లైవ్, టైమ్ వివరాలివే-india vs pakistan in champions trophy 2025 match date time and live telecast and streaming details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Pak Live Streaming: భారత్, పాక్ హైవోల్టేజ్ పోరు.. గెలిస్తే సెమీస్‍కు టీమిండియా.. మ్యాచ్ లైవ్, టైమ్ వివరాలివే

IND vs PAK Live Streaming: భారత్, పాక్ హైవోల్టేజ్ పోరు.. గెలిస్తే సెమీస్‍కు టీమిండియా.. మ్యాచ్ లైవ్, టైమ్ వివరాలివే

Published Feb 21, 2025 03:41 PM IST Chatakonda Krishna Prakash
Published Feb 21, 2025 03:41 PM IST

  • India vs Pakistan - Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఈ ఆదివారం (ఫిబ్రవరి 23) జరగనుంది. ఈ మ్యాచ్ టైమ్, లైవ్ వివరాలు ఇక్కడ చూడండి.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ అదిరే ఆరంభం చేసింది. గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‍పై గ్రూప్-ఏ మ్యాచ్‍లో గెలిచి బోణి కొట్టింది. ఈ టోర్నీలో తదుపరి పాకిస్థాన్‍తో టీమిండియా తలపడనుంది. 

(1 / 5)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ అదిరే ఆరంభం చేసింది. గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‍పై గ్రూప్-ఏ మ్యాచ్‍లో గెలిచి బోణి కొట్టింది. ఈ టోర్నీలో తదుపరి పాకిస్థాన్‍తో టీమిండియా తలపడనుంది. 

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన జరగనుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ ఫైట్ సాగనుంది.

(2 / 5)

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన జరగనుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ ఫైట్ సాగనుంది.

(AFP)

ఇప్పటికే బంగ్లాదేశ్‍తో భారత్ గెలిచింది. పాకిస్థాన్‍‍తో పోరులో విజయం సాధిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గ్రూప్-ఏ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‍కు చేరుకుంటుంది రోహిత్ శర్మ సేన. భారత్ చేతిలో ఓడితే పాక్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే.  

(3 / 5)

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన 2 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అందుకు అరగంట ముందు టాస్ పడుతుంది. 

(4 / 5)

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన 2 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అందుకు అరగంట ముందు టాస్ పడుతుంది. 

(REUTERS)

టీమిండియా, పాకిస్థాన్ మధ్య ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్.. స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్, స్పోర్ట్18 నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. జియోహాట్‍స్టార్ ఓటీటీలో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. 

(5 / 5)

(PTI)

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు