(1 / 5)
ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు గతంలో పటౌడీ ట్రోఫీ పేరు ఉండేది. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ సారి నుంచి పేరు మార్చింది. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ అని పెట్టారు. దీంతో కాంట్రవర్సీ కూడా రేగింది. పటౌడీ పేరును తొలగించొద్దన్నారు. కానీ ఇంగ్లాండ్ బోర్డు నేమ్ ఛేంజ్ చేసింది.
(@BCCI X)(2 / 5)
భారత టెస్టు క్రికెట్లో ఈ సిరీస్ తో కొత్త శకం స్టార్ట్ కాబోతోంది. శుభ్ మన్ గిల్ సారథిగా పగ్గాలు చేపట్టబోతున్నాడు. 25 ఏళ్ల శుభ్ మన్ భారత టెస్టు కెప్టెన్ అయిన రెండో అతిపిన్న వయస్సు ఆటగాడిగా నిలవబోతున్నాడు.
(PTI)(3 / 5)
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేకుండా చాలా కాలం తర్వాత భారత్ ఆడబోతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే. గత నెలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వారం వ్యవధిలోనే టెస్టు రిటైర్మెంట్ ప్రకటించారు.
(PTI)(4 / 5)
భారత స్పీడ్ స్టర్ బుమ్రా టీమిండియాకు కీలకం కానున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో వెన్నెముక గాయంతో బుమ్రా మైదానం వీడాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ 2025లో ఆడాడు బుమ్రా. ఇప్పుడు ఇంగ్లాండ్ లో టీమిండియాకు అతను కీలకం కాబోతున్నాడు.
(PTI)(5 / 5)
కోహ్లి, రోహిత్ లేకపోవడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ కాస్తా బలహీనంగా కనిపిస్తోంది. కానీ యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తో బ్యాటింగ్ డిపార్ట్ మెంట్ బెటర్ గానే ఉంది. మరి ఇంగ్లాండ్ సవాలును దాటి భారత్ సిరీస్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
(PTI)ఇతర గ్యాలరీలు