(1 / 6)
Ind vs Eng 4th T20: ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 రన్స్ చేసింది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె ఆరో వికెట్ కు 87 రన్స్ జోడించడంతో ఈమాత్రం స్కోరైనా చేసింది.
(AP)(2 / 6)
Ind vs Eng 4th T20: హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడు కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చివరికి 30 బంతుల్లోనే 4 సిక్స్ లు, 4 ఫోర్లతో 53 రన్స్ చేసి 18వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు.
(REUTERS)(3 / 6)
Ind vs Eng 4th T20: శివమ్ దూబె కూడా చెలరేగాడు. అతడు 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి అతడు రనౌటయ్యాడు.
(REUTERS)(4 / 6)
Ind vs Eng 4th T20: ఇంగ్లండ్ పేస్ బౌలర్ సఖీబ్ మహమూద్ దెబ్బకు టీమిండియా మొదట్లోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. అతడు 3 వికెట్లు తీయడంతో 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
(PTI)(5 / 6)
Ind vs Eng 4th T20: అయితే మధ్యలో రింకు సింగ్ కూడా చెలరేగాడు. గాయం కారణంగా మధ్యలో రెండు టీ20లకు దూరమైన రింకు.. ఈ మ్యాచ్ లో 26 బంతుల్లో 30 రన్స్ చేశాడు.
(PTI)(6 / 6)
Ind vs Eng 4th T20: అంతకుముందు ఓపెనర్ అభిషేక్ శర్మ 19 బంతుల్లో 29 రన్స్ చేశాడు. అయితే మరో ఓపెనర్ సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. చివర్లో హార్దిక్, శివమ్ దూబె చెలరేగడంతో ఆమాత్రం స్కోరైనా సాధించగలిగింది.
(AFP)ఇతర గ్యాలరీలు