ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్ట్ రేపటి నుంచే.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..-india vs england 1st test live streaming sony liv ott to stream the match from friday 20th june ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్ట్ రేపటి నుంచే.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..

ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్ట్ రేపటి నుంచే.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..

Published Jun 19, 2025 05:06 PM IST Hari Prasad S
Published Jun 19, 2025 05:06 PM IST

ఇండియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. మరి ఈ తొలి టెస్ట్ లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

2023-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరడంలో టీమిండియా విఫలమైంది. ఇక ఇప్పుడు 2025-27 టెస్టు ఛాంపియన్షిప్ వేటను ప్రారంభిస్తోంది. ఇంగ్లండ్ తో భారత్ ఐదు టెస్టులు ఆడనుంది. మరి భారత్-ఇంగ్లండ్ హై వోల్టేజ్ సిరీస్ లో తొలి టెస్టు ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఓ లుక్కేయండి.

(1 / 4)

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. లీడ్స్ లోని హెడింగ్లీలో ఈ మ్యాచ్ జరగనుంది. హై వోల్టేజ్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ 30 నిమిషాలు ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది.

(2 / 4)

భారత్-ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ 2025-27 టెస్టు సిరీస్ ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 5, సోనీ స్పోర్ట్స్ 3 హిందీ, సోనీ స్పోర్ట్స్ 4 తమిళ, తెలుగు ఛానళ్లలో తొలి మ్యాచ్ ప్రసారం కానుంది. ఇక ఈ  మ్యాచ్ స్ట్రీమింగ్ హక్కులు జియోహాట్‌స్టార్ చేతిలో ఉండటం విశేషం.

(3 / 4)

టెస్టు క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు మొత్తం 136 మ్యాచ్ లు ఆడాయి. ఇంగ్లాండ్ 51 టెస్టుల్లో విజయం సాధించింది. భారత్ 35 మ్యాచుల్లో గెలిచింది. ఇరు జట్ల మధ్య యాభై టెస్టులు డ్రా అయ్యాయి.

(4 / 4)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు