IND vs BAN Live Streaming: భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు లైవ్ ఎక్కడ చూడొచ్చు? టైమ్, హెడ్ టూ హెడ్ వివరాలివే
- IND vs BAN 1st Test Live Streaming: భారత్, బంగ్లాదేశ్ మధ్య రేపు (సెప్టెంబర్ 19) తొలి టెస్టు మొదలుకానుంది. ఈ టెస్టు మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడొచ్చు, టైమింగ్స్, ఇరు జట్ల మధ్య హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

(1 / 5)
టీమిండియా సుమారు ఆరు నెలల తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్ బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‍తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ రేపు (సెప్టెంబర్ 19) మొదలుకానుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ పూర్తిగా సిద్ధమైంది. (PTI)
(2 / 5)
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రేపు (సెప్టెంబర్ 19) తొలి టెస్టు మొదలుకానుంది. చెన్నైలోని చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాజ్ జరగనుంది. రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఈ టెస్టు మొదలుకానుంది. అరగంట ముందు 9 గంటలకు టాస్ పడుతుంది. (PTI)
(3 / 5)
లైవ్ వివరాలు: భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు స్పోర్ట్స్ 18 నెట్‍వర్క్ టీవీ ఛానెల్‍లో లైవ్ టెలికాస్ట్ అవనుంది. డిజిటల్ విషయానికి వస్తే.. జియోసినిమా ఓటీటీ ప్లాట్‍పామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. (PTI)
(4 / 5)
హెడ్ టూ హెడ్: టెస్టు క్రికెట్‍లో భారత్, బంగ్లాదేశ్ ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో తలపడ్డాయి. ఇందులో టీమిండియా 11 టెస్టుల్లో గెలిచింది. రెండు డ్రా అయ్యాయి. టెస్టు చరిత్రలో భారత్‍పై బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. (AFP)
ఇతర గ్యాలరీలు