తెలుగు న్యూస్ / ఫోటో /
Boxing Day Test Record: బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఎంసీజీలో 87242 మంది ప్రేక్షకులు.. అన్ని రికార్డులు బ్రేక్
- Boxing Day Test Record: ఎంసీజీ వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు గురువారం (డిసెంబర్ 26) ప్రారంభమైంది. సాధారణంగా బాక్సింగ్ డే రోజు ఎంసీజీలో రికార్డు స్థాయి ప్రేక్షకులు రావడం సహజం. అయితే ఈ మ్యాచ్ మాత్రం మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
- Boxing Day Test Record: ఎంసీజీ వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు గురువారం (డిసెంబర్ 26) ప్రారంభమైంది. సాధారణంగా బాక్సింగ్ డే రోజు ఎంసీజీలో రికార్డు స్థాయి ప్రేక్షకులు రావడం సహజం. అయితే ఈ మ్యాచ్ మాత్రం మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
(1 / 5)
Boxing Day Test Record: ఆస్ట్రేలియాలోని ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రతి ఏటా బాక్సింగ్ డే టెస్టు జరగడం సహజం. ఈ మ్యాచ్ చూడటానికి తొలి రోజు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తుంటారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన నాలుగో టెస్టు తొలి రోజు ఏకంగా 87,242 మంది రావడం విశేషం. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం.
(2 / 5)
Boxing Day Test Record: బాక్సింగ్ డే టెస్టులో చివరిసారి 2019లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ తొలి రోజు ఆటను 80 వేల మంది చూశారు. ఆ తర్వాత కొవిడ్ కారణంగా ప్రతి ఏటా ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మళ్లీ ఈ ఏడాది ఏకంగా 87 వేలకుపైగా ప్రేక్షకులతో అన్ని రికార్డులు బ్రేకయ్యాయి.
(3 / 5)
Boxing Day Test Record: ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియాల్లో ఒకటైన ఎంసీజీలో 90 వేల మంది కూర్చునే వీలుండగా.. దాదాపు ఫుల్ అయిపోయింది. 2020లో ఇక్కడ జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టుకు కొవిడ్ ఉన్నా కూడా 27615 మంది వచ్చారు. ఇప్పుడా సంఖ్య 87 వేలు దాటడం విశేషం.
(4 / 5)
Boxing Day Test Record: క్రిస్మస్ మరుసటి రోజు బాక్సింగ్ డే టెస్టు జరగడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. దీనికి ఎంసీజీనే ఆతిథ్యమిస్తుంది. ఈసారి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉత్కంఠగా జరుగుతున్న నేపథ్యంలో ఎన్నో రోజుల ముందే తొలి రోజు టికెట్లన్నీ అమ్ముడైపోయాయి.
(5 / 5)
Boxing Day Test Record: రికార్డు స్థాయి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ.. తొలి రోజే ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు రసవత్తరంగా మొదలైంది. కోహ్లి, కోన్‌స్టాస్ గొడవతోపాటు ఆస్ట్రేలియా ఆధిపత్యంతో ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 311 రన్స్ చేసింది.(AFP)
ఇతర గ్యాలరీలు