తెలుగు న్యూస్ / ఫోటో /
India vs Australia: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ ఎవరో చెప్పిన కోచ్ గౌతమ్ గంభీర్
- India vs Australia: ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా కాబోతున్నాడన్న వార్తల నేపథ్యంలో ఆ మ్యాచ్ కు కెప్టెన్ ఎవరో వెల్లడించాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

(1 / 5)
India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ చేతుల్లో స్వదేశంలో వైట్ వాష్ కు గురైన ఇండియన్ తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ కీలకమైన సిరీస్ బరిలోకి దిగుతుంది.
(2 / 5)
India vs Australia: రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ అతని విషయంలో ఎలాంటి సమాచారం లేదు. దీంతో పెర్త్ లో జరగబోయే ఈ టెస్టుకు కెప్టెన్ ఎవరు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
(3 / 5)
India vs Australia: రోహిత్ శర్మ లేకపోతే కెప్టెన్ ఎవరు అన్నదానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమాధానం ఇచ్చాడు. వైస్ కెప్టెన్ గా ఉన్న బుమ్రానే తొలి మ్యాచ్ కు కెప్టెన్ గా ఉంటాడని స్పష్టం చేశాడు.
(4 / 5)
India vs Australia: బుమ్రా గతంలో ఇంగ్లండ్ తో జరిగిన ఓ టెస్టులో కెప్టెన్ గా ఉన్నాడు. ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. మరి రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే కెప్టెన్ గా ఉండే బుమ్రా ఏం చేస్తాడో చూడాలి.
ఇతర గ్యాలరీలు