చిన్న వ్యాపారులకు అండగా కేంద్రం.. 5 నగరాల్లో ఓఎన్‌డీసీ ఆవిష్కరణ!-india to launch open e commerce network in 5 cities ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చిన్న వ్యాపారులకు అండగా కేంద్రం.. 5 నగరాల్లో ఓఎన్‌డీసీ ఆవిష్కరణ!

చిన్న వ్యాపారులకు అండగా కేంద్రం.. 5 నగరాల్లో ఓఎన్‌డీసీ ఆవిష్కరణ!

Published Apr 30, 2022 06:51 PM IST HT Telugu Desk
Published Apr 30, 2022 06:51 PM IST

  • ఆన్‌లైన్‌ రిటైల్‌‌కు ప్రాధన్యత పెరుగుతున్న నేపథ్యంలో చిన్న వ్యాపారులకు సపోర్ట్‌గా ఒపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌(ఓఎన్‌డీసీ)ను కేంద్రం ప్రారంభించింది. ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాల ఆధిపత్యాన్ని తగ్గించి చిన్న వ్యాపారులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఈ ఓఎన్‌డీసీను శుక్రవారం 5 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఆవిష్కరించి

దేశీయ ఆన్‌లైన్‌ రిటైల్‌ వ్యాపారంలో చిన్న రిటైలర్లకు తోడ్పాటు అందించేందుకు ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి దశలో 5 నగరాల్లో ఓఎన్‌డీసీ ఆవిష్కరించింది

(1 / 6)

(Twitter)

ఢిల్లీ (ఎన్‌సీఆర్‌), బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్‌ నగరాల్లో ఈ ఓఎన్‌డీసీని ఆవిష్కరించారు. ఈ–కామర్స్‌ ప్రయోజనాలు అందరికీ అందేలా.. ఎంపిక చేసిన వినియోగదారులు, అమ్మకదారులకు, లాజిస్టిక్స్‌ సంస్థలకు ఈ ఓఎన్‌డీసీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లుగా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విటర్ ద్వారా వెల్లడించారు

(2 / 6)

ఈ నగరాల్లో 150 రిటైలర్లను ఇందులోకి తీసుకురావడమే ఈ పైలట్‌ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వాణిజ్య ప్రోత్సాహకాల విభాగం(DPIIT) అదనపు కార్యదర్శి అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు

(3 / 6)

(Reuters)

ఆరు నెలల్లో 100 నగరాల్లో ఓఎన్‌డీసీని విస్తరించి భవిష్యత్‌లో 3 కోట్ల మంది అమ్మకపుదారులను, కోటి మంది రిటైల్‌ వ్యాపారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడమే లక్ష్యం పెట్టుకున్నట్లు అనిల్‌ అగర్వాల్‌ వివరించారు.

(4 / 6)

ఇక గ్రామీణ ప్రాంత వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రాంతీయ భాషల్లోనూ ఈ యాప్‌లను ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు అగ్రవాల్‌ వివరించారు.

(5 / 6)

సంబంధిత కథనం

ఇతర గ్యాలరీలు