Mumbai-Nagpur expressway: ఎన్నో ప్రత్యేకతలతో హైటెక్ ఎక్స్‌ప్రెస్‍వే.. ఇలాంటిది దేశంలోనే తొలిసారి: పూర్తి వివరాలు-india most hi tech mumbai nagpur expressway know key points full details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  India Most Hi-tech Mumbai-nagpur Expressway Know Key Points Full Details

Mumbai-Nagpur expressway: ఎన్నో ప్రత్యేకతలతో హైటెక్ ఎక్స్‌ప్రెస్‍వే.. ఇలాంటిది దేశంలోనే తొలిసారి: పూర్తి వివరాలు

Dec 11, 2022, 08:35 PM IST Chatakonda Krishna Prakash
Dec 11, 2022, 08:35 PM , IST

  • Mumbai-Nagpur expressway: భారత అత్యంత పొడవైన ముంబై-నాగ్‍పూర్ ఎక్స్‌ప్రెస్‍వే తొలి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ  హైటెక్ ఎక్స్‌ప్రెస్‍వే మొత్తం పొడవు 701 కిలోమీటర్లు. ఈ ఎక్స్‌ప్రెస్‍వేకు సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోని అత్యంత హైటెక్ ఎక్స్‌ప్రెస్‍వే ఇదే. పూర్తి వివరాలు ఇవే.

ముంబై - నాగ్‍పూర్ ఎక్స్‌ప్రెస్‍వే తొలి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ అని దీనికి పేరు పెట్టారు.  (Image: Twitter/Narendra Modi)

(1 / 11)

నాగ్‍పూర్ - షిరిడీ మధ్య 520 కిలోమీటర్ల దూరాన్ని ఈ తొలి దశ ఎక్స్‌ప్రెస్‍వే కవర్ చేస్తోంది. (Image: Twitter/Piyush Goyal)

(2 / 11)

మొత్తంగా పూర్తయ్యాక, 701 కిలోమీటర్ల పొడవుతో ఉండే ఈ ఎక్స్‌ప్రెస్‌వే నాగ్‍పూర్ తో ముంబైను కలుపుతుంది. (Image: Twitter/Piyush Goyal) 

(3 / 11)

మహారాష్ట్రకు చెందిన 10 జిల్లాలు, అమరావతి, ఔరంగాబాద్, నాసిక్‍కు చెందిన అర్బన్ ప్రాంతాలను ఈ ఎక్స్‌ప్రెస్‍వే కలుపుతుంది. (Image: Twitter/Piyush Goyal)

(4 / 11)

మూడు అంతర్జాతీయ, ఏడు దేశీయ విమానాశ్రయాలను ఈ సమృద్ధి మహామార్గ్ కనెక్ట్ చేస్తుంది. రెండు భారీ, 48 మైనర్ షిప్పింగ్ పోర్టులను, 6,000 కిలోమీటర్ల రైల్వే నెట్‍వర్కును కలుపుతుంది. (Image: Twitter/Piyush Goyal)

(5 / 11)

జంతువులు రోడ్డు దాటేటప్పుడు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఎక్స్‌ప్రెస్‍వే పొడవునా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక యానిమల్ క్రాసింగ్‍లు ఏర్పాటయ్యాయి. (Image: Twitter/Devendra Fadnavis)

(6 / 11)

వాహనాల స్పీడ్‍ను, వాహనాల బ్రేక్ డౌన్స్, లేన్ క్రమశిక్షణను పర్యవేక్షిచేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‍మెంట్ సిస్టమ్ (ITMS) ఈ ఎక్స్‌ప్రెస్‍వే పొడవునా ఉంటుంది. (Image: Twitter/Devendra Fadnavis)

(7 / 11)

మహారాష్ట్రలో రహదారుల కనెక్టివిటీని ఈ ముంబై-నాగ్‍పూర్  ఎక్స్‌ప్రెస్‍వే గణనీయంగా మెరుగుపరుస్తుందని అంచనా. (Image: Twitter/Devendra Fadnavis)

(8 / 11)

ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రతీ 40-50 కిలోమీటర్ల మధ్య ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్‍లు ఉంటాయి. ఫుడ్ ప్లాజాలు, విశ్రాంతి ఏరియాలతో పాటు చాలా సదుపాయాలు ఉంటాయి.  (Image: Twitter/Devendra Fadnavis)

(9 / 11)

రూ.55,000 కోట్ల వ్యయంతో ఈ 701 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‍వే నిర్మితమవుతోంది. (Image: Twitter/Devendra Fadnavis)

(10 / 11)

ప్రత్యక్షంగా 10 కీలకమైన జిల్లాలు, ఫీడర్ల ద్వారా పరోక్షంగా 14 జిల్లాలు, 24 తాలుకాలు, 392 గ్రామాల గుండా ముంబై-నాగ్‍పూర్ ఎక్స్‌ప్రెస్‍వే ప్రయాణిస్తోంది. (Image: Twitter/Narendra Modi)

(11 / 11)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు