Champions Trophy India: మిస్టరీ స్పిన్నర్ తిప్పేశాడు.. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా అదరగొట్టాడు.. విజయంలో వరుణ్ కీ రోల్-india is winner of icc champions trophy 2025 final vs new zealand varun chakravarthy played key role in team victory ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Champions Trophy India: మిస్టరీ స్పిన్నర్ తిప్పేశాడు.. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా అదరగొట్టాడు.. విజయంలో వరుణ్ కీ రోల్

Champions Trophy India: మిస్టరీ స్పిన్నర్ తిప్పేశాడు.. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా అదరగొట్టాడు.. విజయంలో వరుణ్ కీ రోల్

Published Mar 09, 2025 10:22 PM IST Chandu Shanigarapu
Published Mar 09, 2025 10:22 PM IST

  • Champions Trophy India: టీమిండియా మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆదివారం (మార్చి 9) ఫైనల్లో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. ఈ టోర్నీలో లేట్ గా అడుగుపెట్టినా.. ట్రోఫీ గెలవడంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీ రోల్ ప్లే చేశాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు మ్యాచ్ లే ఆడిన వరుణ్ చక్రవర్తి 9 వికెట్లు పడగొట్టి భారత్ ఛాంపియన్ గా నిలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. అతని సగటు 15.11 గా ఉండటం విశేషం. 

(1 / 5)

ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు మ్యాచ్ లే ఆడిన వరుణ్ చక్రవర్తి 9 వికెట్లు పడగొట్టి భారత్ ఛాంపియన్ గా నిలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. అతని సగటు 15.11 గా ఉండటం విశేషం. 

(AP)

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లో వరుణ్ చక్రవర్తి బెంచ్ కే పరిమితమయ్యాడు. కానీ న్యూజిలాండ్ తో గ్రూప్ మ్యాచ్ కోసం భారత్ నలుగురు స్పిన్నర్లను ఆడించడంతో వరుణ్ కు చోటు దక్కింది. 

(2 / 5)

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లో వరుణ్ చక్రవర్తి బెంచ్ కే పరిమితమయ్యాడు. కానీ న్యూజిలాండ్ తో గ్రూప్ మ్యాచ్ కోసం భారత్ నలుగురు స్పిన్నర్లను ఆడించడంతో వరుణ్ కు చోటు దక్కింది. 

(AP)

న్యూజిలాండ్ తో గ్రూప్ మ్యాచ్ లో వరుణ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఆ తర్వాత సెమీస్ లో ఆసీస్ పైనా అదరగొట్టాడు. రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఫైనల్లోనూ రెండు వికెట్లతో మెరిశాడు. 

(3 / 5)

లెగ్ స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లను వరుణ్ ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఓవర్ స్పిన్ తో వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. టీ20ల్లో అదరగొట్టి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

(4 / 5)

లెగ్ స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లను వరుణ్ ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఓవర్ స్పిన్ తో వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. టీ20ల్లో అదరగొట్టి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

(PTI)

నిజానికి మొదట ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టులో వరుణ్ కు చోటు దక్కలేదు. కానీ టీ20ల్లో అతని అద్భుత ప్రదర్శనతో వన్డే జట్టులోకి తీసుకున్నారు. చివర్లో టీమిండియా జట్టులో మార్పులు చేశారు. 

(5 / 5)

నిజానికి మొదట ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టులో వరుణ్ కు చోటు దక్కలేదు. కానీ టీ20ల్లో అతని అద్భుత ప్రదర్శనతో వన్డే జట్టులోకి తీసుకున్నారు. చివర్లో టీమిండియా జట్టులో మార్పులు చేశారు. 

(PTI)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు