IND vs NZ 2nd Test: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టుకు పిచ్ ఎలా ఉండనుంది? కివీస్‍కు కష్టాలేనా!-ind vs nz 2nd test pune pitch report slow pitch preparing for the india important match against new zealand ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Nz 2nd Test: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టుకు పిచ్ ఎలా ఉండనుంది? కివీస్‍కు కష్టాలేనా!

IND vs NZ 2nd Test: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టుకు పిచ్ ఎలా ఉండనుంది? కివీస్‍కు కష్టాలేనా!

Published Oct 22, 2024 09:47 PM IST Chatakonda Krishna Prakash
Published Oct 22, 2024 09:47 PM IST

  • IND vs NZ 2nd Test Pitch: భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు పుణె వేదికగా జరగనుంది. టీమిండియాకు అత్యంత ముఖ్యమైన ఈ టెస్టుకు పిచ్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. అందుకు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడయ్యాయి.

న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‍లో పరాజయం చెంది మూడో టెస్టుల సిరీస్‍లో 0-1తో వెనుకబడింది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం వేదికగా అక్టోబర్ 24 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. సిరీస్ నిలుపుకోవాలంటే భారత్‍కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా ఉంది. 

(1 / 5)

(AFP)

రెండో టెస్టు జరిగే పుణె పిచ్ స్లోగా ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ పిచ్ స్పిన్‍కు ఎక్కువగా అనుకూలించేలా ఉంటుందని తెలుస్తోంది. తొలి టెస్టు జరిగిన బెంగళూరు పిచ్‍తో పోలిస్తే.. ఈ పుణె పిచ్‍పై బౌన్స్ కూడా తక్కువగానే అవనుంది. పిచ్‍ను భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేడు (అక్టోబర్ 22) పరిశీలించారు. 

(2 / 5)

(PTI)

పుణె పిచ్‍లో ఎక్కువ నల్లమట్టిని వినియోగించడం వల్ల స్పిన్‍కు అధికంగా అనుకూలించనుంది. పేసర్లకు ఎక్కువగా మద్దతు ఉండదు. పిచ్ ఫ్లాట్‍గానే ఉంటుంది. దీంతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉన్న భారత్‍కు ఇది కలిసి వచ్చే అంశంగా ఉంది. న్యూజిలాండ్‍ బ్యాటర్లకు ఇది కష్టంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే కివీస్ జట్టు స్పిన్ విభాగం కూడా పెద్ద పటిష్టంగా లేదు. 

(3 / 5)

భారత్ ఈ రెండో టెస్టుకు కూడా ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కొనసాగే ఛాన్స్ ఉంది. పుణె పిచ్‍పై బంతి ఎక్కువగా టర్న్ అవనుంది.  

(4 / 5)

(HT_PRINT)

మరో రెండు రోజుల్లో అక్టోబర్ 24న మొదలయ్యే రెండో టెస్టు కోసం భారత ప్లేయర్లు పుణె స్టేడియంలో నేడు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా పలువురు ప్లేయర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. న్యూజిలాండ్ ప్లేయర్లు కూడా ప్రాక్టీస్ చేశారు. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు