Ind vs NZ 1st Test Day 3: మూడో రోజు కోలుకున్నా ఇంకా పొంచే ఉన్న ఓటమి ముప్పు.. టీమిండియా గట్టెక్కుతుందా?
Ind vs NZ 1st Test Day 3: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా కాస్త పుంజుకున్నా ఓటమి మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలతో రెండో ఇన్నింగ్స్ లో ఇండియన్ టీమ్ పోరాడుతోంది.
(1 / 5)
Ind vs NZ 1st Test Day 3: బెంగళూరు టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా కాస్త కోలుకుంది తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ను 402 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమ్.. మూడో రోజు ముగిసే సమయానికి 3 వికెట్లకు 231 రన్స్ చేసింది. ఇంకా 125 పరుగులు వెనుకబడే ఉంది.(PTI)
(2 / 5)
Ind vs NZ 1st Test Day 3: విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలతో మూడో వికెట్ కు 136 పరుగులు జోడించి టీమ్ ను ఆదుకున్నారు. అయితే చివర్లో కోహ్లి 70 రన్స్ చేసి ఔటవడంతో మరోసారి ఇండియన్ టీమ్ కష్టాల్లో పడింది.(PTI)
(3 / 5)
Ind vs NZ 1st Test Day 3: బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డకౌటైన విరాట్ కోహ్లి రెండో ఇన్నింగ్స్ లో 70 రన్స్ చేశాడు. అయితే 46 పరుగులకే ఆలౌట్ కావడం అనేది ఈ మ్యాచ్ లో టీమిండియాను ఇంకా ఓటమి భయం నుంచి బయటపడేయడం లేదు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో గట్టెక్కడం అంత సులువు కాకపోవచ్చు.(PTI)
(4 / 5)
Ind vs NZ 1st Test Day 3: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే ఇంకా 125 పరుగులు వెనుకబడే ఉంది. ఎలాగోలా ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. మొత్తంగా టెస్టులో ఓటమి నుంచి బయటపడుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ 70 పరుగులతో క్రీజులో ఉండగా.. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ లాంటి వాళ్లు ఇంకా బ్యాటింగ్ కు దిగాల్సి ఉంది.(AP)
ఇతర గ్యాలరీలు