Yashasvi Jaiswal: వరుసగా రెండు డబుల్ సెంచరీలు.. అయినా జైస్వాల్‍కు దక్కని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'-ind vs eng yashasvi jaiswal did not get player of the match despite scoring two consecutive double centuries ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Yashasvi Jaiswal: వరుసగా రెండు డబుల్ సెంచరీలు.. అయినా జైస్వాల్‍కు దక్కని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'

Yashasvi Jaiswal: వరుసగా రెండు డబుల్ సెంచరీలు.. అయినా జైస్వాల్‍కు దక్కని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'

Published Feb 18, 2024 07:11 PM IST Chatakonda Krishna Prakash
Published Feb 18, 2024 07:11 PM IST

Yashasvi Jaiswal: భారత యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్‍తో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‍ల్లో డబుల్ సెంచరీలు చేశాడు. రికార్డులు సృష్టించాడు. అయితే, ద్విశతకాలు చేసినా ఈ రెండు టెస్టుల్లో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కలేదు.

భారత్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో విజృంభిస్తున్నాడు. రెండు, మూడు టెస్టుల్లో వరుసగా డబుల్ సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్‍పై రెండు టెస్టు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 

(1 / 8)

(ANI)

ఇంగ్లండ్‍పై ఈ సిరీస్‍లో రెండు, మూడు టెస్టుల్లో టీమిండియా గెలువడంలో జైస్వాల్ కీలకపాత్ర పోషించాడు. డబుల్ సెంచరీలతో జట్టుకు మంచి స్కోర్లు అందించాడు. తన ఏడు టెస్టుల్లోనే రెండు ద్విశతకాలను నమోదు చేశాడు జైస్వాల్. 

(2 / 8)

(REUTERS)

అయితే, డబుల్ సెంచరీలు చేసినా.. రెండు టెస్టుల్లోనూ జైస్వాల్‍కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కలేదు. 

(3 / 8)

(AFP)

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 209 పరుగులతో డబుల్ సెంచరీ చేశాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమైనా టీమిండియాకు మంచి స్కోరు అందించాడు. అయితే, ఆ మ్యాచ్‍లో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా.. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. ఫ్లాట్ పిచ్‍పై బుమ్రా సత్తాచాటాడు. దీంతో ఈ రెండో టెస్టులో బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

(4 / 8)

(PTI)

రాజ్‍కోట్‍లో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (214 నాటౌట్) అజేయంగా డబుల్ సెంచరీ చేశాడు. అయితే, ఈ టెస్టులో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయటంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‍లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు. టీమిండియా గెలుపులో అతడు కూడా కీలకపాత్ర పోషించాడు. దీంతో జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

(5 / 8)

ఇలా ఇంగ్లండ్‍తో వరుస మ్యాచ్‍ల్లో డబుల్ సెంచరీలు చేసినా జైస్వాల్‍కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కలేదు. 

(6 / 8)

కాగా, రాజ్‍కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో మ్యాచ్ నాలుగో రోజైన నేడు (ఫిబ్రవరి 18) టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‍పై గెలిచింది. టెస్టు చరిత్రలో పరుగుల పరంగా భారత్‍కు ఇదే అతిపెద్ద విజయం. 

(7 / 8)

(ANI )

మూడో టెస్టులో గెలుపుతో ఈ ఐదు మ్యాచ్‍ల సిరీస్‍‍లో 2-1తో ముందంజ వేసింది భారత్. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రాంచీలో ఫిబ్రవరి 23న మొదలుకానుంది.

(8 / 8)

(AP)

ఇతర గ్యాలరీలు