IND vs CAN: మ్యాచ్ రద్దు: ఫుట్‍బాల్ ఆడుతూ.. ముచ్చట్లు పెడుతూ సరదాగా గడిపిన భారత ఆటగాళ్లు.. ఫ్యాన్స్‌కు పంత్ ఆటోగ్రాఫ్‍లు
- IND vs CAN T20 World Cup 2024: భారత్, కెనడా మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏ మ్యాచ్ రద్దయింది. ఇది టీమిండియాకు చివరి గ్రూప్ మ్యాచ్‍గా ఉంది. ఇప్పటికే భారత్ సూపర్-8 చేరింది. కెనడాతో మ్యాచ్ జరగపోవడంతో టీమిండియా ఆటగాళ్లు సరదాగా సమయాన్ని గడిపారు.
- IND vs CAN T20 World Cup 2024: భారత్, కెనడా మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏ మ్యాచ్ రద్దయింది. ఇది టీమిండియాకు చివరి గ్రూప్ మ్యాచ్‍గా ఉంది. ఇప్పటికే భారత్ సూపర్-8 చేరింది. కెనడాతో మ్యాచ్ జరగపోవడంతో టీమిండియా ఆటగాళ్లు సరదాగా సమయాన్ని గడిపారు.
(1 / 7)
టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో టీమిండియా చివరి మ్యాచ్ రద్దయింది. ఫ్లోరిడా వేదికగా కెనడాతో జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షంతో చిత్తడైన ఔట్‍ఫీల్డ్ వల్ల టాస్ పడకుండానే క్యాన్సల్ అయింది. ఇప్పటికే మూడు మ్యాచ్‍లు గెలిచిన భారత్.. గ్రూప్-ఏలో టాపర్‌గా సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ జరగపోవటంతో భారత ఆటగాళ్లు సరదాగా గడిపారు.
(2 / 7)
వర్షం నిలిచినా అప్పటికే ఫ్లోరిడా మైదానం ఔట్‍ఫీల్డ్ బాగా చిత్తడిగా మారింది. దీంతో పలుసార్లు ఇన్‍స్పెక్షన్ చేసిన అంపైర్లు ఇక ఆట సాధ్యం కాదని తేల్చేశారు. భారత్, కెనడా మ్యాచ్‍ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
(PTI)(3 / 7)
అంతకు మందు టాస్ ఆలస్యం కావటంతో భారత ఆటగాళ్లు సరదాగా ఫుట్‍బాల్ ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు భారత ఆటగాళ్లందరూ సరదాగా ఫుట్‍బాల్ ఆడారు. సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. రెండున్నర గంటల తర్జనభర్జన తర్వాత ఈ మ్యాచ్‍ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అంపైర్లు.
(PTI)(4 / 7)
మ్యాచ్ రద్దవడంతో స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు నిరాశ చెందారు. అయితే ఆటోగ్రాఫ్‍లు ఇచ్చి కొందరికి సంతోషాన్ని కలిగించాడు భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్. ప్రేక్షకుల వద్దకే వెళ్లి ఆటోగ్రాఫ్‍లు ఇచ్చాడు.
(AP)(5 / 7)
కెనడా ఆటగాళ్లతో భారత ప్లేయర్లు ముచ్చటించారు. కెనడా జట్టులోనూ చాలా మంది భారత సంతతి ప్లేయర్లు ఉన్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. కెనడా ప్లేయర్లతో మాట్లాడాడు.
(PTI)(6 / 7)
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో కెనడా ప్లేయర్లు ఫొటోలు దిగారు. కోహ్లీ వారితో ముచ్చటించాడు. కోహ్లీని కలిసినందుకు కెనడా ఆటగాళ్లు చాలా సంతోషంగా కనిపించారు.
(ANI)ఇతర గ్యాలరీలు