(1 / 7)
Ind vs Ban: ఢిల్లీ బాయ్స్ విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ ఎలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారో చూశారు కదా. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయిన తర్వాత విరాట్ తో అతడు ఎలా ఉంటాడో అన్న సందేహాలకు ఈ ఫొటో సమాధానం చెప్పేసినట్లే.
(PTI)(2 / 7)
Ind vs Ban: కోహ్లి, గంభీర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కానీ ఈ ఇద్దరూ ఇప్పుడిలా నవ్వుతూ కనిపించడం అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. వాళ్ల మధ్యలోకి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వచ్చి ఇలా ఆనందాన్ని పంచుకున్నాడు.
(PTI)(3 / 7)
Ind vs Ban: విరాట్ ఏం జోక్ వేశాడోగానీ ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గంభీర్ కూడా ఇలా పడీపడీ నవ్వుతూ కనిపించాడు.
(PTI)(4 / 7)
Ind vs Ban: ట్రైనింగ్ సెషన్ సమయంలో కెమెరాలన్నీ ఈ ఇద్దరిపైనే ఉన్నాయి.
(PTI)(5 / 7)
Ind vs Ban: ఢిల్లీకే చెందిన ఈ ఇద్దరూ గతంలో ఐపీఎల్లో తీవ్రంగా గొడవ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా ఇద్దరూ కలిసిపోయారు. ఇప్పుడు టీమిండియా క్యాంప్ లో ఫ్రెండ్స్ కూడా అయ్యారు.
(PTI)(6 / 7)
Ind vs Ban: ఈ నవ్వుల పార్టీలోకి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వచ్చి చేరాడు
(PTI)(7 / 7)
Ind vs Ban: బంగ్లాదేశ్ తో టీమిండియా తొలి టెస్టు గురువారం (సెప్టెంబర్ 19) నుంచి ప్రారంభం కానుండగా.. చెన్నైలో ఇండియన్ టీమ్ జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది.
(PTI)ఇతర గ్యాలరీలు