Jasprit Bumrah: 46 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన బుమ్రా.. గాయంతో బయటికి వెళ్లిన భారత స్టార్.. కెప్టెన్‍గా కోహ్లీ-ind vs aus 5th test jasprit bumrah breaks 46 years old bishan singh bedi record ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jasprit Bumrah: 46 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన బుమ్రా.. గాయంతో బయటికి వెళ్లిన భారత స్టార్.. కెప్టెన్‍గా కోహ్లీ

Jasprit Bumrah: 46 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన బుమ్రా.. గాయంతో బయటికి వెళ్లిన భారత స్టార్.. కెప్టెన్‍గా కోహ్లీ

Jan 04, 2025, 10:38 AM IST Chatakonda Krishna Prakash
Jan 04, 2025, 10:29 AM , IST

  • Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా మరో రికార్డును బద్దలుకొట్టేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటుతున్న అతడు.. 46 ఏళ్ల ఓ రికార్డును బ్రేక్ చేసి.. చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుతో టెస్టు సిరీస్‍లో భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‍తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టుకు కెప్టెన్సీ చేస్తున్న బుమ్రా.. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో చరిత్ర సృష్టించాడు.

(1 / 5)

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుతో టెస్టు సిరీస్‍లో భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‍తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టుకు కెప్టెన్సీ చేస్తున్న బుమ్రా.. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో చరిత్ర సృష్టించాడు.(AFP)

ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్‍ను ఐదో టెస్టు రెండో రోజు బుమ్రా ఔట్ చేశాడు. దీంతో ఈ సిరీస్‍లో 32వ వికెట్ దక్కించుకున్నాడు. మరో రికార్డు బద్దలు కొట్టాడు. 

(2 / 5)

ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్‍ను ఐదో టెస్టు రెండో రోజు బుమ్రా ఔట్ చేశాడు. దీంతో ఈ సిరీస్‍లో 32వ వికెట్ దక్కించుకున్నాడు. మరో రికార్డు బద్దలు కొట్టాడు. (AFP)

ఆస్ట్రేలియా గడ్డపై ఒక టెస్టు సిరీస్‍లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. భారత దిగ్గజం బిషన్ బేడీ పేరిట సుమారు 46 ఏళ్లుగా ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 

(3 / 5)

ఆస్ట్రేలియా గడ్డపై ఒక టెస్టు సిరీస్‍లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. భారత దిగ్గజం బిషన్ బేడీ పేరిట సుమారు 46 ఏళ్లుగా ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. (AFP)

1977-78లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‍లో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్లను తీశారు. ఆసీస్‍లో ఓ టెస్టు సిరీస్‍లో అత్యధిక వికెట్ల రికార్డు అప్పటి నుంచి ఆయన పేరిటే ఉంది. దాన్ని ఇప్పుడు బుమ్రా బద్దలుకొట్టాడు. ప్రస్తుత సిరీస్‍లో ఇప్పటి వరకు 32 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ బుమ్రా బౌలింగ్ చేయాల్సి ఉంది. 

(4 / 5)

1977-78లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‍లో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్లను తీశారు. ఆసీస్‍లో ఓ టెస్టు సిరీస్‍లో అత్యధిక వికెట్ల రికార్డు అప్పటి నుంచి ఆయన పేరిటే ఉంది. దాన్ని ఇప్పుడు బుమ్రా బద్దలుకొట్టాడు. ప్రస్తుత సిరీస్‍లో ఇప్పటి వరకు 32 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ బుమ్రా బౌలింగ్ చేయాల్సి ఉంది. (AFP)

కాగా, ఈ ఐదో టెస్టు రెండో రోజున లంచ్‍కు ముందు బుమ్రా గాయపడ్డాడు. దీంతో స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. బుమ్రా వెళ్లడంతో టీమిండియాకు స్టాండిన్ కెప్టెన్‍గా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ భారత్‍కు సారథ్యం వహిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 181 పరుగులకు భారత్ ఔట్ చేసింది. 4 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. 

(5 / 5)

కాగా, ఈ ఐదో టెస్టు రెండో రోజున లంచ్‍కు ముందు బుమ్రా గాయపడ్డాడు. దీంతో స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. బుమ్రా వెళ్లడంతో టీమిండియాకు స్టాండిన్ కెప్టెన్‍గా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ భారత్‍కు సారథ్యం వహిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 181 పరుగులకు భారత్ ఔట్ చేసింది. 4 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. (AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు