Increase Stamina on Bed: లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసే 5 రకాల డ్రింక్స్, ఇవి తాగితే మీ పార్టనర్‌కి పండగే!
Increase Stamina on Bed: రిలేషన్‌షిప్ హ్యాపీగా నడవాలంటే ముఖ్య పాత్ర పోషించేది సెక్స్ లైఫ్.దీని కోసం తమ పార్టనర్‌కి అందంగా అలంకరించుకుని కనిపించడం, శుభ్రంగా రెడీ అవడం వంటివి చేస్తుంటారు. కానీ, అసలైన లైంగిక సామర్థ్యాన్ని పెంచే విషయాలను మర్చిపోతుంటారు. మీరు అలా చేయకుండా ఉండేందుకు తప్పక ఫాలో అయిపోండి.
(1 / 6)
వయస్సుతో పాటు తగ్గిపోతున్న లైంగిక సామర్థ్యాన్ని ఫిట్‌నెస్‌తో మెరుగుపరుచుకోవచ్చు. మరి ఈ ఫిట్‌నెస్ సాధించడానికి కేవలం వ్యాయామాలు చేస్తే సరిపోదు. దానికి సరిపడా ఆహారం కూడా తీసుకోవాలి. ఇందులో ప్రధానంగా కొన్ని రకాలైన డ్రింక్స్ రక్త ప్రసరణ వేగాన్ని పెంచి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవేంటో తెలుసుకుందామా..
(Pexel)(2 / 6)
గ్రీన్ టీ: వెయిట్ లాస్ కోసమే కాకుండా గ్రీన్ టీ అనేది మీలో లైంగిక వాంఛలను కూడా పెంచుతుంది. ఇది మహిళల్లో కోరికలు పెరగడానికి బాగా పనిచేస్తుంది. మర్మావయవాలకు రక్తప్రవాహాన్ని పెంచి సెక్స్ డ్రైవ్ పెంచుతుంది.
(Pexel)(3 / 6)
బ్లాక్ కాఫీ:సాధారణంగా మూడ్‌ను పెంచే డ్రింక్ అని బ్లాక్ కాఫీ గురించి చెప్తుంటారు. ఇందులో ఉండే కెఫైన్ మహిళలతో పురుషుల్లోనూ లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. రోజూ కాఫీ తాగే మగవారిలో స్కలన సమస్యలు తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో రుజువైంది.
(Pexel)(4 / 6)
రెడ్ వైన్: పురుషులతో పాటు మహిళల్లోనూ లైంగిక వాంఛలను పెంచే మరో డ్రింక్ రెడ్ వైన్. రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగిన మహిళల్లో సెక్స్ డ్రైవ్ ఎక్కువసేపు ఉంటే, పురుషుల్లో టెస్టోస్టిరాన్ లెవల్స్‌ను పరుగులు పెట్టిస్తుందట.
(Pexel)(5 / 6)
బనానా షేక్: లైంగికంగా కలవడానికి ముందు బనానా షేక్ తాగితే మీరు ఇంకాస్త ఎక్కువ సేపు చెలరేగిపోవచ్చట. కేవలం ఫిజికల్ గానే కాకుండా లైంగికంగానూ మిమ్మల్ని బలవంతులుగా మారుస్తుందట. అరటిపండులో ఉండే బ్రమోలిన్ ఎంజైమ్ మగాళ్లలో టెస్టోస్టిరాన్, లిబిడోలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇతర గ్యాలరీలు