Tata Tigor iCNG AMT: ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ తో సీఎన్జీ కార్స్.. దూసుకుపోవడమే ఇక..
- Tata Tigor iCNG AMT: CNG మోడల్ కారులో ఆటోమేటక్ ట్రాన్స్‌మిషన్‌ను పరిచయం చేసిన మొదటి సంస్థగా టాటా మోటార్స్ నిలిచింది.టాటా మోటార్స్ లేటెస్ట్ గా Tigor iCNG, Tigor iCNG లలో ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ను ప్రవేశపెట్టారు.
- Tata Tigor iCNG AMT: CNG మోడల్ కారులో ఆటోమేటక్ ట్రాన్స్‌మిషన్‌ను పరిచయం చేసిన మొదటి సంస్థగా టాటా మోటార్స్ నిలిచింది.టాటా మోటార్స్ లేటెస్ట్ గా Tigor iCNG, Tigor iCNG లలో ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ను ప్రవేశపెట్టారు.
(1 / 8)
టిగోర్ iCNG, Tiago iCNG లను AMT ట్రాన్స్‌మిషన్‌తో టాటా మోటార్స్ విడుదల చేసింది. సీఎన్జీ వాహనం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రావడం ఇదే మొదటిసారి.
(2 / 8)
టాటా టియాగో iCNG AMT మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి XTA CNG, XZA+ CNG, XZA NRG. అలాగే, Tigor iCNG AMT రెండు వేరియంట్‌లలో వస్తోంది. అవి XZA CNG, XZA+ CNG.
(3 / 8)
టిగోర్ iCNG AMTకి టాటా మోటార్స్ ఎటువంటి అదనపు మార్పులు చేయలేదు. ఇది ఇప్పటికే భారత మార్కెట్లో విక్రయిస్తున్న టిగోర్ iCNG వేరియంట్ మాదిరిగానే ఉంటుంది. అందువల్ల, ఈ వాహనంపై iCNG బ్యాడ్జింగ్ ఉంటుంది కానీ AMT బ్యాడ్జ్ ఉండదు.
(4 / 8)
ఈ కార్ లో ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించారు. కాబట్టి ఒక పెద్ద CNG ట్యాంక్‌కు బదులుగా రెండు చిన్న ట్యాంక్స్ ఉంటాయి. దీనివల్ల బూట్ స్పేస్ కొంత పెరుగుతుంది. ఇందులో రెండు సూట్‌కేసులు, బ్యాగ్ ప్యాక్‌లను ఈ స్థలంలో అమర్చవచ్చు.
(5 / 8)
ఇందులో అదే 1.2-లీటర్, 3-సిలిండర్, నాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్ ఉంటుంది, ఇది CNGపై నడుస్తున్నప్పుడు గరిష్టంగా 72 bhp శక్తిని మరియు 95 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే పెట్రోల్‌పై నడుస్తున్నప్పుడు పవర్ 84 bhp వరకు పెరుగుతుంది. టార్క్ 113 Nm వరకు పెరుగుతుంది.
(6 / 8)
ఈ కార్ ఇంటీరియర్ దాదాపు Tigor iCNG లాగానే ఉంటుంది. ఈ కారులోని ప్యాసెంజర్ ఫుట్‌వెల్ ప్రాంతంలో అగ్నిమాపక యంత్రాన్ని అమర్చారు. అలాగే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింద CNG బటన్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పై CNG-సంబంధిత సమాచారం కూడా కనిపిస్తుంది.
(7 / 8)
సిఎన్‌జిపై డ్రైవింగ్ చేయడాన్ని ఆస్వాదించేలా ఈ కారులో టాటా అనేక మార్పులు చేసింది. ఇది పెట్రోల్ మరియు CNG మోడ్‌ల మధ్య నిర్వహించే ఒకే ECUని ఉపయోగిస్తుంది. దీని కారణంగా, CNG నుండి పెట్రోల్‌కి మారడం లేదా పెట్రోలు నుంచి సీఎన్జీ కి మారడం చాలా స్మూత్ గా జరుగుతుంది. CNG ట్యాంక్ ఖాళీ అయితే, కారు ఆటోమేటిక్‌గా పెట్రోల్‌తో నడుస్తుంది.
ఇతర గ్యాలరీలు