తెలుగు న్యూస్ / ఫోటో /
మాయమైపోయిన తాజ్ మహల్! వాయు కాలుష్యంతో ఉత్తర భారతం విలవిల..
- ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలను దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది! దిల్లీ, పంజాబ్, హరియాణాలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది.
- ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలను దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది! దిల్లీ, పంజాబ్, హరియాణాలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది.
(1 / 6)
ఉత్తర్ ప్రదేశ్లో దట్టమైన పొగమంచు ప్రభావం తాజ్ మహల్ మీద కూడా పడింది. పొగమంచు కారణంగా తాజ్ మహల్ మాయమైపోయినట్టు అనిపించింది!(REUTERS)
(2 / 6)
దట్టమైన పొగమంచు వెనుక తాజ్ మహల్ కనుమరుగవుతుండగా విదేశీ పర్యాటకులు ఫోటోకు పోజులిచ్చారు.(Yatish Lavaniya)
(3 / 6)
భారీ వాయు కాలుష్యం, పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉండటంతో అనేక చోట్ల రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.(AFP)
(4 / 6)
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటైన దిల్లీలోని లోధీ ప్రాంతం పొగమంచుతో నిండిపోయింది.(REUTERS)
(5 / 6)
భారత్తో పాటు పొరుగు దేశమైన పాకిస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి, వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో మాస్క్లు వేసుకునే రోజులు తిరిగి వచ్చాయి!(AFP)
ఇతర గ్యాలరీలు