Gujarat floods: గుజరాత్ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు; 30 మందికి పైగా మృతి
- గుజరాత్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 మందికి పైగా చనిపోయారు. రేపు సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

(1 / 6)
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాల్లోకి కూడా వరద నీరు చేరింది. గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా గత మూడు రోజుల్లో 30 మందికి పైగా మృతి చెందినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.(AP)
(2 / 6)
గుజరాత్ లోని వడోదర జిల్లాలో గురువారం కురిసిన భారీ వర్షానికి పాక్షికంగా నీట మునిగిన ఇంటి పైకప్పుపై మొసలి కనిపించింది.(PTI)
(4 / 6)
గుజరాత్ లో భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతంలో భారత నౌకాదళ బృందం సహాయక చర్యలు చేపట్టింది.(PTI)
(5 / 6)
గుజరాత్ లోని దేవభూమి ద్వారకా జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతం నుంచి ఇద్దరు వ్యక్తులను ఇండియన్ కోస్ట్ గార్డ్ విమానం రక్షించింది.(PTI)
ఇతర గ్యాలరీలు