Porsche: లగ్జరీ కార్స్ పోర్షే 911 కరెరా జీటీఎస్, పోర్షే 911 కరేరా లోని ప్రత్యేకతలు తెలుసా..
- Porsche: తన ప్రొడక్ట్ లైన్ లోకి మరో రెండు లగ్జరీ మోడల్స్ ను పోర్షే తీసుకువస్తోంది. తాజాగా పోర్షే 911 కరేరా జీటీఎస్, పోర్షే కరేరా లను ఆవిష్కరించింది. పోర్షే 911 కరేరా జీటీఎస్ లో కొత్త 3.6-లీటర్ టర్బోఛార్జ్డ్ బాక్సర్ ఇంజిన్ ఉంటుంది. అలాగే, 911 కరేరాలో 3.0-లీటర్ బాక్సర్ ఇంజిన్ ఉంటుంది.
- Porsche: తన ప్రొడక్ట్ లైన్ లోకి మరో రెండు లగ్జరీ మోడల్స్ ను పోర్షే తీసుకువస్తోంది. తాజాగా పోర్షే 911 కరేరా జీటీఎస్, పోర్షే కరేరా లను ఆవిష్కరించింది. పోర్షే 911 కరేరా జీటీఎస్ లో కొత్త 3.6-లీటర్ టర్బోఛార్జ్డ్ బాక్సర్ ఇంజిన్ ఉంటుంది. అలాగే, 911 కరేరాలో 3.0-లీటర్ బాక్సర్ ఇంజిన్ ఉంటుంది.
(1 / 9)
పోర్షే కొత్త 911 మోడల్ కార్స్ ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. కొత్త 911 కరేరా జీటీఎస్, 911 కరెరా ఉన్నాయి. పోర్షే 911 మోడళ్లకు హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే తొలిసారి.
(2 / 9)
911 కరేరా ట్విన్ టర్బో ఛార్జర్స్ తో కూడిన 3.0-లీటర్ బాక్సర్ ఇంజన్ ను ఉపయోగిస్తుంది. ఇది గరిష్టంగా 392 బీహెచ్ పీ పవర్ ను, 450ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ప్రొడ్యస్ చేస్తుంది. కొత్త 911 కారెరా కూపే కేవలం 4.1 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. స్పోర్ట్ క్రోనో ప్యాకేజీ సహాయంతో దీన్ని 3.9 సెకన్లకు తగ్గించవచ్చు. గరిష్ట వేగం గంటకు 294 కిలోమీటర్లు.
(3 / 9)
పోర్షే 911 కరెరా జీటీఎస్ 3 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 312 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులోని టీ-హైబ్రిడ్ సిస్టమ్ కొత్తగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ఎగ్జాస్ట్ గ్యాస్ టర్బో ఛార్జర్ ను ఉపయోగిస్తుంది.
(4 / 9)
911 కరెరా జీటీఎస్ కోసం పోర్షే కొత్త పవర్ ట్రెయిన్ను అభివృద్ధి చేసింది. ఇది 3.6-లీటర్ బాక్సర్ ఇంజన్. ఎయిర్ కండిషనింగ్ కంప్రెషర్, టర్బోచార్జర్లకు పవర్ ఇవ్వడానికి ఈ విద్యుత్తును ఉపయోగిస్తున్నారు. టర్బోఛార్జర్ లో ఒక చిన్న ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 540బిహెచ్ పి పవర్ మరియు 610ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
(5 / 9)
టర్బైన్ మరియు కంప్రెసర్ మధ్య షాఫ్ట్ లో 11 కిలోవాట్ల (14.7 బిహెచ్ పి) మోటారు ఉంటుంది. ఈ మోటారు వేగవంతమైన ప్రతిస్పందన కోసం టర్బోను త్వరగా తిప్పుతుంది, తక్కువ టర్బో లాగ్ ను నిర్ధారిస్తుంది, అదే సమయంలో శక్తిని తిరిగి 400-వోల్ట్ బ్యాటరీలోకి పంపుతుంది.
(6 / 9)
కొత్త పవర్ట్రెయిన్లో పిఎంఎస్ ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంది, ఇది మరింత శక్తివంతమైన 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్తో అనుసంధానించబడి ఉంటుంది. ఈ-మోటార్ 40 కిలోవాట్ల (53.6 బీహెచ్పీ) పవర్ బూస్ట్, 150 ఎన్ఎమ్ వరకు అదనపు డ్రైవ్ టార్క్ ను అందిస్తుంది.
(7 / 9)
ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ రెండూ బానెట్ క్రింద ఉన్న చిన్న 1.9 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తాయి, ఇది మిగిలిన 911 మోడళ్లకు శక్తినిచ్చే సాంప్రదాయ 12-వోల్ట్ బ్యాటరీకి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు.
(8 / 9)
కారు లోని మిగిలిన ఎలక్ట్రికల్స్ కు శక్తినిచ్చే కొత్త తేలికపాటి 12-వోల్ట్ బ్యాటరీ ఇప్పుడు వెనుక పార్శిల్ షెల్ఫ్ వెనుక ఉన్న కంపార్ట్ మెంట్ కు మారింది. మునుపటితో పోలిస్తే, కొత్త 911 కారెరా జిటిఎస్ సమగ్ర మార్పులు ఉన్నప్పటికీ, గత మోడల్స్ కన్నా ఇది కేవలం 50 కిలోల బరువు మాత్రమే ఎక్కువ ఉంటుంది.
ఇతర గ్యాలరీలు