(1 / 6)
Japan plane fire: టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో జపాన్ ఎయిర్ లైన్స్ జెట్ విమానం మంటలకు ఆహుతైంది. ఆగి ఉన్న కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీ కొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
(AP)(2 / 6)
మంటల్లో చిక్కుకున్న విమానంలో ఉన్న 379 మంది ప్రయాణీకులను, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ లోని ఆరుగురు సిబ్బందిలో ఐదుగురి ఆచూకీ తెలియరావడం లేదు.
(AP)(3 / 6)
ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నామని ఏర్ పోర్ట్ అథారిటీ, కోస్ట్ గార్డ్ ప్రకటించాయి. హొక్కైడో ద్వీపం లోని షిన్ చిటోస్ నుంచి టోక్యో కు వచ్చిన విమానం ఈ ప్రమాదానికి గురైంది.
(X/ @sentdefender)(4 / 6)
విమానాన్ని చుట్టుముట్టిన మంటలను ఆర్పివేయడానికి ఏర్ పోర్ట్ సిబ్బంది, ఫైర్ బ్రిగేడ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం దాదాపు బూడిదగా మారింది.
(AFP)(5 / 6)
ఈ ప్రమాదం అనంతరం టోక్యోలోని హనెడా విమానాశ్రయంలోని అన్ని రన్ వేలను తాత్కాలికంగా మూసివేశారు.
(REUTERS)(6 / 6)
జపాన్ లో అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయాల్లో ఒకటి ఈ హనెడా విమానాశ్రయం. నూతన సంవత్సర ప్రయాణాల వల్ల గత రెండు రోజులుగా విమానాశ్రయంలో రద్దీ మరింత పెరిగింది.
(REUTERS)ఇతర గ్యాలరీలు