Mocha cyclone : నాలుగు దశాబ్దాల్లోనే అతి పెద్ద తుపాను సృష్టించిన విధ్వంసం ఇది..-in pics mocha possibly the strongest tropical cyclone in north indian ocean since 1982 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics : Mocha Possibly The Strongest Tropical Cyclone In North Indian Ocean Since 1982

Mocha cyclone : నాలుగు దశాబ్దాల్లోనే అతి పెద్ద తుపాను సృష్టించిన విధ్వంసం ఇది..

May 16, 2023, 06:20 AM IST Sharath Chitturi
May 16, 2023, 06:20 AM , IST

Mocha cyclone : మోకా తుపాను ధాటికి వాయువ్య మయన్మార్​ ప్రాంతం అల్లాడిపోయింది. ఒకానొక సందర్భంలో గంటకు 200కి.మీల వేగంతో గాలి వీయడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలకూలాయి. హిందూ మహా సముద్రంలో 1982 తర్వాత పుట్టుకొచ్చిన అతిపెద్ద తుపాను ఇదేనని అధికారులు చెబుతున్నారు.

మయన్మార్​ రఖీనె రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో పరిస్థితి ఇది. ఇక్కడ అనేక చెట్లు నేలకూలి రవాణా వ్యవస్థ దెబ్బతింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

(1 / 6)

మయన్మార్​ రఖీనె రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో పరిస్థితి ఇది. ఇక్కడ అనేక చెట్లు నేలకూలి రవాణా వ్యవస్థ దెబ్బతింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.(Sai Aung Main / AFP)

మధ్య మయన్మార్​ ప్రాంతంలో వరదల కారణంగా నీటిలో చిక్కుకున్న ఓ ఆలయ చిత్రం ఇది. ఈ ప్రాంతంలో వరదల మధ్య చిక్కుకున్న దాదాపు 1000మందిని అధికారులు రక్షించారు.

(2 / 6)

మధ్య మయన్మార్​ ప్రాంతంలో వరదల కారణంగా నీటిలో చిక్కుకున్న ఓ ఆలయ చిత్రం ఇది. ఈ ప్రాంతంలో వరదల మధ్య చిక్కుకున్న దాదాపు 1000మందిని అధికారులు రక్షించారు.(Military True News Information Team via AP)

మన్​ స్వే సాట్​ టావ్​ పగోడా ప్రాంతంలో వరద ఉద్ధృతి ఇది. తుపాను కారణంగా వేరువేరు ప్రాంతాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.

(3 / 6)

మన్​ స్వే సాట్​ టావ్​ పగోడా ప్రాంతంలో వరద ఉద్ధృతి ఇది. తుపాను కారణంగా వేరువేరు ప్రాంతాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.(Military True News Information Team via AP)

సెట్వే పట్టణంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. సమాచార వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. పునరుద్ధరణ చర్యలు నత్తనడకన సాగుతున్నాయి.

(4 / 6)

సెట్వే పట్టణంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. సమాచార వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. పునరుద్ధరణ చర్యలు నత్తనడకన సాగుతున్నాయి.(AP )

బంగ్లాదేశ్​లోని అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన వారు నిదానంగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.

(5 / 6)

బంగ్లాదేశ్​లోని అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన వారు నిదానంగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.(Munir uz Zaman / AFP)

తుపాను బీభత్సం మధ్య టెక్నాఫ్​లో పునరావాస కేంద్రాలకు వెళుతున్న స్థానికులు.

(6 / 6)

తుపాను బీభత్సం మధ్య టెక్నాఫ్​లో పునరావాస కేంద్రాలకు వెళుతున్న స్థానికులు.(Jibon Ahmed / Reuters)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు