Ambani Family At Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో పాల్గొన్న ముఖేశ్ అంబానీ కుటుంబం.. ఫొటోలు
- Ambani Family At Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో ముఖేశ్ అంబానీ.. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
- Ambani Family At Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో ముఖేశ్ అంబానీ.. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
(1 / 7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ముఖేశ్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా, రాధిక, మనుమలు పృథ్వీ, వేద, సోదరీమణులు దీప్తి సాల్గావ్కర్, నినా కొఠారితో కలిసి కుంభమేళాకు వచ్చారు.
(AP)(2 / 7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుటుంబానికి చెందిన నాలుగు తరాలవారు ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. మహాకుంభమేళా సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించారు. వీరితో పాటు అంబానీ అత్త పూనంబెన్ దలాల్, మరదలు మమతాబెన్ దలాల్ ఉన్నారు.
(PTI)(3 / 7)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించారు. నిరంజని అఖాడాకు చెందిన స్వామి కైలాసానంద్ గిరి జీ మహరాజ్.. అంబానీ కుటుంబ సభ్యులతో పూజ నిర్వహించారు.
(PTI)(4 / 7)
కట్టుదిట్టమైన భద్రత నడుమ అరైల్ ఘాట్ వద్ద పుణ్యసానం చేసింది అంబానీ కుటుంబం. అరైల్‌లోని పర్మార్త్ త్రివేణి పుష్కర్ వద్ద జరిగిన యాగంలో ఈ కుటుంబం పాల్గొంది.
(PTI)(5 / 7)
కుంభమేళాలో పాల్గొన్న భక్తుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ తీర్థయాత్ర సేవ పేరి పలు కార్యక్రమాలు చేస్తోంది.
(AP)(6 / 7)
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులకు పోషకాహారం, అత్యవసర వైద్య సేవలు, రవాణా సదుపాయాలువంటి సేవలను చేస్తుంది.
(AP)ఇతర గ్యాలరీలు