‘ఎటు చూసినా బూడిదే!’ లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుకు 16 మంది బలి! వేల కోట్ల ఆర్థిక నష్టం..
- అమెరికా లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చు కారణంగా మరణించిన వారి సంఖ్య 16కు చేరింది! ఓవైపు మంటలు, మరోవైపు బూడిదతో లాస్ ఏంజెల్స్‌లోని అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర విషదాన్ని ఎదుర్కొంటున్నారు.
- అమెరికా లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చు కారణంగా మరణించిన వారి సంఖ్య 16కు చేరింది! ఓవైపు మంటలు, మరోవైపు బూడిదతో లాస్ ఏంజెల్స్‌లోని అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర విషదాన్ని ఎదుర్కొంటున్నారు.
(1 / 5)
కార్చిచ్చుకు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న పాలిసాడెస్లో ఇప్పుడు అగ్నిప్రమాదం ఈశాన్యంలో వ్యాపించి, సంపన్న దక్షిణ కాలిఫోర్నియా పరిసర ప్రాంతాలైన బ్రెంట్వుడ్, బెల్ ఎయిర్‌లను చుట్టేసింది. గ్రేటర్ లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఇళ్లను ధ్వంసం చేసిన కార్చిచ్చును అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.
(2 / 5)
లాస్ ఏంజెల్స్ చుట్టుపక్కల పాలిసేడ్స్ ఫైర్, ఈటన్ ఫైర్, కెన్నెత్ ఫైర్, హర్ట్స్ ఫైర్, వుడ్లీ ఫైర్, లిడియా ఫైర్, సన్సెట్ ఫైర్, టైలర్ ఫైర్ అనే ఆరు ప్రధాన కార్చిచ్చులు దాదాపు 40,000 ఎకరాలను దగ్ధం చేశాయి. నివాసాలు, వ్యాపారాలతో సహా 12,000 పైగా నిర్మాణాలను నాశనం చేశాయి.
(Getty Images via AFP)(3 / 5)
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చుగా ఇది నిలిచిపోబోతోంది. అయితే ఈ కార్చిచ్చు తీవ్రతకు గల కారణాలపై పరిశోధనలు జరుగుతున్నా, ఇంకా ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ కార్చిచ్చు అమెరికా చరిత్రలో అత్యంత ఖరీదైనదిగా మారుతుందని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి, ఆర్థిక నష్టాలు 135 బిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్ డాలర్ల మధ్య ఉంటాయని తెలుస్తోంది.
(Getty Images via AFP)(4 / 5)
పాలిసెడ్స్ ఫైర్‌ని నియంత్రించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. 25వేల ఎకరాలు కాలి బూడదయ్యాయి.
(Getty Images via AFP)ఇతర గ్యాలరీలు