టార్గెట్​ 'సన్​'- ఆదిత్య ఎల్​1 లాంచ్​.. ఫొటోలు చూసేయండి!-in pics isros aditya l1 takes off from satish dhawan space centre ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  టార్గెట్​ 'సన్​'- ఆదిత్య ఎల్​1 లాంచ్​.. ఫొటోలు చూసేయండి!

టార్గెట్​ 'సన్​'- ఆదిత్య ఎల్​1 లాంచ్​.. ఫొటోలు చూసేయండి!

Sep 02, 2023, 12:57 PM IST Sharath Chitturi
Sep 02, 2023, 12:57 PM , IST

ఆదిత్య ఎల్​1 మిషన్​ లాంచ్​ సక్సెస్​ అయ్యింది. సూర్యుడి గురించి కీలక విషయాలు తెలుసుకునేందుకు ఇస్రో ఈ ప్రాజెక్ట్​ చేపట్టింది.

ఆదిత్య ఎల్​1ను మోసుకెళుతున్న పీఎస్​ఎల్​వీ రాకెట్​.. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగిరింది. వేలాది మంది ఔత్సాహికులు.. శ్రీహరికోటకు తరలివెళ్లి, ఆదిత్య ఎల్​1 లాంచ్​ను లైవ్​లో వీక్షించారు.

(1 / 6)

చంద్రయాన్​-3 తర్వాత ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్​.. ఈ ఆదిత్య ఎల్​1. అంతేకాకుండా.. సూర్యుడి గురించి పరిశోధనలకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్​ కూడా ఇదే కావడం ఇశేషం.

(2 / 6)

(AP)

ఈ ఆదిత్య ఎల్​1.. భూమి నుంచి 1.5 మిలియన్​ కిలోమీటర్లు ప్రయాణించి, లాగ్రేజియన్​ పాయింట్​ 1(ఎల్​1) వద్దకు చేరుకుంటుంది. ఇందుకు దాదాపు 4 నెలల సమయం పడుతుందని ఇస్రో వెల్లడించింది.

(3 / 6)

(ANI)

ఈ ఆదిత్య ఎల్​1లో 7 పేలోడ్స్​ ఉంటాయి. వీటిల్లో విజిబుల్​ ఎమిషన్​ లైన్​ కొరొనాగ్రఫీ ఒకటి. నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్న అనంతరం.. ఇది భూమికి, రోజుకు 1440 ఇమేజ్​లను పంపిస్తుంది. మొత్తం 7 పేలోడ్స్​లో నాలుగింటింటి సూర్యుడి ఖాతిని అబ్సర్వ్​ చేసేందుకు వినియోగిస్తోంది ఇస్రో. 

(4 / 6)

భూమి కక్ష్యలో 16 రోజుల పాటు ఉంటుంది ఆదిత్య ఎల్​1. ఆ తర్వాత సూర్యుడివైపు ప్రయాణాన్ని మొదలుపెడుతుంది.

(5 / 6)

(ISRO Twitter)

ఆదిత్య ఎల్​1 జీవితకాలం ఐదేళ్లని తెలుస్తోంది. అప్పటివరకు భూమికి ఫొటోలు పంపుతూ ఉంటుంది. అయితే.. ఇంధనం ఖర్చు చేసే ఆధారంగా ఇది 5ఏళ్ల కన్నా ఎక్కువ కాలం కూడా పనిచేసే అవకాశం ఉంటుంది.

(6 / 6)

(ISRO)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు