తెలుగు న్యూస్ / ఫోటో /
Himachal Pradesh winter destinations : కళ్లకు కనువిందు.. 'హిమాచల్' అందాలు!
Himachal Pradesh winter destinations : దేశంలో అత్యంత సుందరమైన ప్రదేశాలకు కేరాఫ్ అడ్రస్ హిమాచల్ ప్రదేశ్. ఇక శీతాకాలంలో హిమాచల్ అందాలు మరింత పెరిగి, కళ్లకు కనివిందు చేస్తాయి. ఈ నేపథ్యంలో ఈ శీతాకాలంలో చూడదగిన 6 ప్రదేశాలపై ఓ లుక్కేయండి.
(1 / 7)
శీతాకాలాన్ని ఆహ్లాదంగా గడపాలంటే హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాల్సిందే! మంచు పర్వతాల మధ్య.. 'మంచు కురిసే వేళలో..' అంటూ పాటలు పాడాల్సిందే. కుటుంబసభ్యులు, హనీమూన్ కపుల్స్, ట్రావెలర్స్‌కు అడ్డాగా హిమాచల్ ప్రదశ్ నిలుస్తుంది. ఇక్కడి అందాలు.. మనసుకు ప్రశాంతతతో కళ్లకు కనువిందునిస్తాయి.(Unsplash)
(2 / 7)
హిమాచల్ ప్రదేశ్‌లోని సుందరమైన ప్రదేశాల్లో స్పితి వ్యాలీ ఒకటి. దీనికి లిటిల్ టిబెట్ అన్న పేరు కూడా ఉంది. భూమి మీద స్వర్గంలాగా ఉంటుంది ఈ ప్రాంతం. ఇక్కడ ఎన్నో బుద్ధిస్ట్ మొనాస్ట్రీలు ఉన్నాయి. ఎంతో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు నిలయం ఈ స్పితి వ్యాలీ. పారాగ్లైడింగ్, క్యాంపింక్, హైకింగ్ కూడా ఇక్కడ ఉంటాయి.(HT photo )
(3 / 7)
కన్నౌర్ జిల్లాలో నదీ ప్రాంతం వద్ద ఉండే పట్టణం కల్ప. శిమ్లా- కాజా రహదారికి సమీపంలో ఇది ఉంటుంది. అపిల్ తోటలు, బుద్ధిస్ట్ మొనాస్ట్రీలకు ఈ ప్రాంతం ఫేమస్.(HT photo)
(4 / 7)
రోహ్తంగ్ పాస్ లేకుండా హిమాచల్ ప్రదేశ్ ట్రిప్‌ని ముగించలేము! ప్రకృతిపరంగా అత్యంత సుందరమైన ప్రదేశం ఈ రోహ్తంగ్ పాస్. మనాలీ నుంచి ఇది 51కి.మీల దూరంలో ఉంటుంది. ఇక్కడ బైక్ రైడింగ్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.(Unsplash)
(5 / 7)
సంగ్లా వ్యాలీ.. మరో చూడచక్కని ప్రదేశం. ఇది కూడా కన్నౌర్ జిల్లాలోనే ఉంది. పైన్ చెట్లు ఒకవైపు.. హిమాలయ పర్వతాలు మరొకవైపు ఉండటంతో ఈ ప్రాంతం అందాలు రెట్టింపు అయ్యాయి. యాపిల్, యాప్రికాట్ తోటలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం చాలా నచ్చుతుంది.(Unsplash)
(6 / 7)
శిమ్లా జిల్లాలో ఉన్న మషోబ్రా.. హిమాచల్ ప్రదేశ్‌లో మరో చూడచక్కని ప్రాంతం. ఇది సముద్ర మట్టానికి 2246మీటర్ల ఎత్తులో ఉంటుంది. దట్టమైన అడవులు, పండ్ల తోటలకు ఇది పెట్టింది పేరు. ప్రకృతి ఒడిలోకి జారుకోవాలంటే ఈ ప్రాంతాన్ని సందర్శించాల్సిందే!(SHUTTERSTOCK)
ఇతర గ్యాలరీలు