Garmin MARQ II series : మార్క్యూ 2 సిరీస్ నుంచి 5 వాచ్‌లు.. ధర రూ. 2లక్షలపైనే!
Garmin MARQ II series : గార్మిన్ ఇండియా.. మార్క్యూ 2 సిరీస్‌లో భాగంగా ఐదు రకాల వాచ్‌లను ఆవిష్కరించింది. ఈ ప్రీమియం వాచ్‌ల విశేషాలు, ధర వంటి వివారాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
మార్క్యూ అథ్లెట్- దీనిని టిటానియం కేస్‌తో నిర్మించారు. లైట్ వెయిట్ వెంటెడ్ సిలికోన్ రబ్బర్ స్ట్రాప్‌ను ఏర్పాటు చేశారు. పర్ఫార్మెన్స్నకు సంబంధించిన రీడింగ్స్‌ని ట్రాక్ చేయవచ్చు. ట్రైనింగ్, రికవరీ వంటి రీడింగ్స్ కూడా ఉంటాయి. ధర రూ. 19,4990
(Garmin)(2 / 5)
మార్క్యూ అడ్వెంచర్- ఇందులో ఎడ్జ్ టు ఎడ్జ్ లెథర్ డిజైన్, డ్యూరెబుల్ ఎఫ్కేఎం రబ్బర్ హైబ్రీడ్ స్ట్రాప్ ఉంటాయి. ధర రూ. 2,15,490
(Garmin)(3 / 5)
మార్క్యూ కెప్టెన్- ఇందులో నేవీ సెరమిక్ బెజెల్, రెగెట్ట టైమర్, రేస్ ఇన్స్పైర్డ్ స్ట్రిప్డ్ జాక్గార్డ్ వేవ్ నైలాన్ స్ట్రాప్ ఉంటుంది. అలర్ట్, అలరామ్లు ఉంటాయి. కయాకింగ్, స్టాండప్ పాడిల్ బోర్డింగ్, విండ్సర్ఫింగ్, కట్సర్ఫింగ్ వంటి స్పోర్ట్స్ రీడింగ్స్ కూడా ఉంటాయి. ధర రూ. 2,25,990
(Garmin)(4 / 5)
మార్క్యూ గోల్ఫర్- ఇందులో గోల్ఫ్-కోర్స్ స్ఫూర్తితో తీసుకున్న కలర్ థీమ్ ఉంటుంది. గ్రీన్ సెరామిక్ ఇన్లే, కస్టమ్ ఎచ్డ్ బెజెల్, ట్రిటోన్ గ్రీన్ జాక్గార్డ్, వేవ్ నైలాన్ స్ట్రాప్ ఉంటాయి. 42వేలకుపైగా గోల్ఫ్ కోర్సెస్ ప్రీలోడ్ అయి ఉన్నాయి. ఫలితంగా.. ఎలాంటి కోర్స్‌లో ఆడుతున్నారు, ఫ్రెంట్‌కి ఎంత దూరం ఉంది వంటి రీడింగ్స్ వస్తాయి. ధర రూ. 2,35,990
(Garmin)ఇతర గ్యాలరీలు