తెలుగు న్యూస్ / ఫోటో /
Global NCAP: గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొందిన ఫస్ట్ మారుతి కారు
- నవంబర్ 11వ తేదీన లాంచ్ అవుతున్న 2024 మారుతి సుజుకీ డిజైర్ సేల్స్ ను పెంచేందుకు మరో అంశం తోడైంది. గ్లోబల్ ఎన్సిఎపి క్రాష్ టెస్ట్ లో ఈ సెడాన్ 5 స్టార్ రేటింగ్ సాధించి, ఇలా 5 స్టార్ సాధించిన ఫస్ట్ మారుతి కారుగా నిలిచింది.
- నవంబర్ 11వ తేదీన లాంచ్ అవుతున్న 2024 మారుతి సుజుకీ డిజైర్ సేల్స్ ను పెంచేందుకు మరో అంశం తోడైంది. గ్లోబల్ ఎన్సిఎపి క్రాష్ టెస్ట్ లో ఈ సెడాన్ 5 స్టార్ రేటింగ్ సాధించి, ఇలా 5 స్టార్ సాధించిన ఫస్ట్ మారుతి కారుగా నిలిచింది.
(1 / 7)
నాల్గవ తరం డిజైర్ గ్లోబల్ ఎన్సిఎపి నుండి ఫైవ్ స్టార్ క్రాష్ రేటింగ్ పొందిన మొట్టమొదటి మారుతి సుజుకి కారుగా నిలిచింది. కారులోని పెద్దలు, పిల్లలతో పాటు పాదచారుల భద్రతా పారామీటర్ల ఆధారంగా గ్లోబల్ ఎన్సిఎపి గ్లోబల్ కార్ మోడళ్లపై క్రాష్ టెస్ట్ లను నిర్వహిస్తుంది,
(2 / 7)
మారుతి సుజుకి స్వచ్ఛందంగా తమ తాజా డిజైర్ ను క్రాష్ టెస్ట్ కు పంపిందని గ్లోబల్ ఎన్ సిఎపి తెలిపింది. కొత్త డిజైర్ నవంబర్ 11 న భారతదేశంలో లాంచ్ కానుంది.
(3 / 7)
మారుతి సుజుకి డిజైర్ లోపల నిర్మాణం, ఫుట్ వెల్ ప్రాంతం క్రాష్ టెస్ట్ సమయంలో స్థిరంగా ఉందని రేటింగ్ ఇవ్వబడింది. ఈ సెడాన్ ఇప్పుడు అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్ గా అందిస్తుంది.
(4 / 7)
ఫ్రంటల్-ఇంపాక్ట్ పరీక్షలో, గ్లోబల్ ఎన్సిఎపి టెస్ట్ లో పెద్దల రక్షణకు సంబంధించి ఛాతీ మరియు తలకు పూర్తి రక్షణ ఉందని, పిల్లలకు కూడా మంచి రక్షణ కలిగి ఉందని తేల్చింది.
(5 / 7)
సైడ్ ఇంపాక్ట్ పరీక్షల్లో మారుతి సుజుకికి చెందిన నాల్గవ తరం డిజైర్ తల, ఛాతీ, పొత్తికడుపు. కటి భాగాలకు 'మంచి రక్షణ' అందించింది.
(6 / 7)
సైడ్-పోల్ ఇంపాక్ట్ పరీక్షలో, తల, పొత్తికడుపు, కటికి సరైన రక్షణ ఉందని తేలింది. అయితే, ఛాతీ భాగానికి మాత్రం సరైన రక్షణ లేదని తేలింది.
ఇతర గ్యాలరీలు