Shinzo Abe funeral : క్వీన్​ ఎలిజబెత్​కు మించిన ఖర్చుతో షింజో అబే అంత్యక్రియలు!-in pics expensive state funeral of former japan s pm shinzo abe ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shinzo Abe Funeral : క్వీన్​ ఎలిజబెత్​కు మించిన ఖర్చుతో షింజో అబే అంత్యక్రియలు!

Shinzo Abe funeral : క్వీన్​ ఎలిజబెత్​కు మించిన ఖర్చుతో షింజో అబే అంత్యక్రియలు!

Sep 26, 2022, 04:14 PM IST Sharath Chitturi
Sep 26, 2022, 04:14 PM , IST

Shinzo Abe funeral : మరికొన్ని రోజుల్లో జపాన్​ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం 217 దేశాల నుంచి 700మంది అతిథులు జపాన్​కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమం కోసం భారీగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.

జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1.66 బిలియన్​ యెన్​ను(దాదాపు రూ. 94కోట్లు) ఖర్చు చేసేందుకు ప్రభుత్వం చూస్తోందని సమాచారం.

(1 / 7)

ఇటీవలే బ్రిటన్​లో క్వీన్​ ఎలిజబెత్​ అంత్యక్రియలు ముగిశాయి. ఇందుకోసం 1.3 బిలియన్​ యెన్​ ఖర్చు అయినట్టు నివేదికలు వచ్చాయి. ఇక 1.66 బిలియన్​ యెన్​ను ఖర్చు చేస్తే.. షింజో అబే అంత్యక్రియలు.. క్వీన్​ ఎలిజబెత్​ కార్యక్రమాలను మించిపోతాయి!

(2 / 7)

అనేక దేశాధినేతలు షింజో అబే అంత్యక్రియలకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో వారి భద్రత, వసతి కోసం భారీగా ఖర్చు అవుతుంది.

(3 / 7)

షింజో అబే అంత్యక్రియల కోసం కేటాయించిన నిధులలో సగం.. దేశాధినేతల భద్రత కోసమే వినియోగించనున్నట్టు తెలుస్తోంది.

(4 / 7)

217 దేశాల నుంచి 700మంది అతిథులు షింజో అబే అంత్యక్రియలకు వెళ్లనున్నారు. 

(5 / 7)

ప్రధాని నరేంద్ర మోదీ.. మంగళవారం జపాన్​కు వెళ్లనున్నారు. షింజో అబే అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. మోదీ.. షింజో అబేకి మంచి మిత్రుడు అని ప్రపంచానికి తెలిసిన విషయమే.

(6 / 7)

జపాన్​కు సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన షింజో అబే.. జులై 8న దారుణ హత్యకు గురయ్యారు. ప్రపంచం ఉల్లిక్కిపడే విధంగా.. ఓ వ్యక్తి.. షింజో అబేని చంపేశాడు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు