న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట- ఫొటోలు చూస్తేనే భయపడిపోతారు!-in pics chaos at new delhi railway station as maha kumbh bound crowd triggers stampede ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట- ఫొటోలు చూస్తేనే భయపడిపోతారు!

న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట- ఫొటోలు చూస్తేనే భయపడిపోతారు!

Published Feb 16, 2025 06:08 PM IST Sharath Chitturi
Published Feb 16, 2025 06:08 PM IST

  • మహా కుంభమేళా కోసం వేలాది మంది భక్తులు ప్రయాగ్​రాజ్​కు వెళ్తుండగా శనివారం రాత్రి 10 గంటలకు న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు.

న్యూదిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 18కి చేరింది. ఫుట్​ఓవర్ బ్రిడ్జిపై నుంచి కొందరు ప్రయాణికులు కిందకు దిగుతుండగా జారిపడటంతో గందరగోళం మొదలైందని, మరికొందరు వారిపై పడిపోయారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

(1 / 8)

(AP)

శనివారం నాడు న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో మహా కుంభమేళా కోసం రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రయాణీకుల రద్దీ. 14, 15 ప్లాట్​ఫాంలు కిక్కిరిసిపోవడంతో ప్రయాగ్​రాజ్​కు వెళ్లే భక్తుల తాకిడి పెరిగింది. ఈ తొక్కిసలాటలో డజను మందికి పైగా గాయపడ్డారు.

(2 / 8)

(PTI)

శనివారం జరిగిన ఘోర తొక్కిసలాట తరువాత న్యూదిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఒక దృశ్యం ఇది. అకస్మాత్తుగా ప్రయాణికుల రద్దీ ఈ గందరగోళానికి దారితీసిందని, చాలా మంది ఊపిరాడక కుప్పకూలిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

(3 / 8)

(Hindustan Times)

ప్రయాగ్​రాజ్ ఎక్స్​ప్రెస్ బయలుదేరే సమయానికి ప్లాట్​ఫాం 14 అప్పటికే రద్దీగా ఉందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (రైల్వే) ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ ఆలస్యమవడంతో పరిస్థితి విషమించి 12, 13, 14 ప్లాట్ ఫామ్​లపై రద్దీ పెరిగింది.

(4 / 8)

ప్రయాగ్​రాజ్ మహా కుంభమేళాకు వెళ్లే రైళ్లలో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ప్రయాణికుల ఫొటోలు ఇవి.

(5 / 8)

రైలు ఎక్కే క్రమంలో చాలా మంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

(6 / 8)

రైలు ఎక్కే క్రమంలో చాలా మంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

(PTI)

నివారం నాడు జరిగిన తొక్కిసలాట అనంతర పరిణామాలు ఇలా..

(7 / 8)

నివారం నాడు జరిగిన తొక్కిసలాట అనంతర పరిణామాలు ఇలా..

(Hindustan Times)

ఫుట్​ఓవర్​ బ్రిడ్జ్​ నుంచి తీసిన ఫొటో..

(8 / 8)

ఫుట్​ఓవర్​ బ్రిడ్జ్​ నుంచి తీసిన ఫొటో..

(PTI)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు