(1 / 7)
మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు సోమవారం యూఎస్ క్యాపిటల్ భవనం వద్ద కనిపించారు.
(2 / 7)
వాషింగ్టన్ డీసీలోని యూఎస్ క్యాపిటల్ రోటుండాలో డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వచ్చారు. వీరద్దరు కాసేపు ముచ్చటించారు.
(Getty Images via AFP)(3 / 7)
లారెన్ శాంచెజ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
(via REUTERS)(4 / 7)
మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలో కొన్ని కార్యక్రమాలు రద్దు అయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా బహిరంగ వేడుకలు, కార్యక్రమాలు రద్దు చేశారు.
(via REUTERS)(5 / 7)
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ ప్రమాణ స్వీకారంలో ఫొటోలకు పోజులిచ్చారు.
(6 / 7)
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్, ఆయన సతీమణి లారా బుష్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు.
(7 / 7)
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ యూఎస్ క్యాపిటల్‌లోని రొటుండా వద్ద అమెరికా ప్రతినిధి కాట్ కామాక్ తో కలిసి కనిపించారు.
ఇతర గ్యాలరీలు