2024 TVS Jupiter: న్యూ లుక్ లో, అప్ గ్రేడెడ్ ఇంజన్, ఫీచర్స్ తో 2024 టీవీఎస్ జూపిటర్ లాంచ్
- న్యూ లుక్, సరికొత్త ఫీచర్స్, అప్ గ్రేడెడ్ ఇంజన్ తో 2024 మోడల్ జూపిటర్ 110 ను గురువారం టీవీఎస్ లాంచ్ చేసింది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 73,700. ఇది నాలుగు వేరియంట్లలో, ఆరు కలర్ ఆప్షన్స్ తో లభిస్తుంది.
- న్యూ లుక్, సరికొత్త ఫీచర్స్, అప్ గ్రేడెడ్ ఇంజన్ తో 2024 మోడల్ జూపిటర్ 110 ను గురువారం టీవీఎస్ లాంచ్ చేసింది. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 73,700. ఇది నాలుగు వేరియంట్లలో, ఆరు కలర్ ఆప్షన్స్ తో లభిస్తుంది.
(1 / 10)
టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త తరం జూపిటర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది డ్రమ్, డ్రమ్ అల్లాయ్, డ్రమ్ ఎస్ఎక్స్ సీ, మరియు డిస్క్ ఎస్ఎక్స్ సీ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
(2 / 10)
దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.73,700 నుంచి ప్రారంభమౌతోంది. డాన్ బ్లూ మ్యాట్, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, టైటానియం గ్రే మ్యాట్, స్టార్లైట్ బ్లూ గ్లాస్, లూనార్ వైట్ గ్లాస్, మెటియోర్ రెడ్ గ్లాస్ అనే ఆరు కలర్ ఆప్షన్లు ఉన్నాయి.
(3 / 10)
ఇందులో కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. బ్లూటూత్, అప్లికేషన్ సపోర్ట్ తో స్మార్ట్ కనెక్ట్ తో వస్తుంది. ఫైండ్ మీ ఫీచర్, ఎంప్టీ, యావరేజ్, రియల్ టైమ్ ఫ్యూయల్ ఎకానమీ వంటి కొన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
(4 / 10)
ఆల్ ఎల్ఈడీ లైటింగ్, టర్న్ సిగ్నల్ ల్యాంప్ రీసెట్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, హజార్డ్ ల్యాంప్స్ ఉన్నాయి. వెనకవైపు ఫాలో-మీ హెడ్ ల్యాంప్, ఇన్ఫినిటీ ఎల్ఈడీ లైట్ బార్ ఉన్నాయి.
(5 / 10)
ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, చిన్న క్యూబీ స్పేస్, హుక్, మొబైల్ డివైజ్ లను ఛార్జ్ చేయడానికి యూఎస్ బీ పోర్ట్, రెండు హెల్మెట్లను నిల్వ చేయగల పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి.
(6 / 10)
ఈ సెగ్మెంట్లో ఈ సీటు అతిపెద్దదని, అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయని టీవీఎస్ తెలిపింది. కాల్, ఎస్ఎంఎస్, నావిగేషన్, వాయిస్ అసిస్ట్ తో బ్లూటూత్ ఎనేబుల్డ్ క్లస్టర్ ఉంది. ఈ స్కూటర్ ప్యానెల్స్ మెటల్ తో తయారు చేశారు.
(7 / 10)
2024 టివిఎస్ జూపిటర్ లోని ఇంజన్ ఇప్పుడు 113.3 సిసి యూనిట్, ఇది ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్షన్ పొందుతుంది. ఇది 5,000 ఆర్ పిఎమ్ వద్ద 7.91 బిహెచ్ పి శక్తిని, 5,000 ఆర్ పిఎమ్ వద్ద 9.2 ఎన్ఎమ్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
(8 / 10)
ఇది సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అయితే, ఇందులో కొత్తగా ఎలక్ట్రిక్ అసిస్ట్ ఉంటుంది, ఇది టార్క్ అవుట్ పుట్ ను 9.8 ఎన్ఎమ్ కు పెంచుతుంది. ప్రారంభంలో, లేదా ఓవర్ టేక్ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. జూపిటర్ 110 గరిష్ట వేగం గంటకు 82 కిలోమీటర్లు.
(9 / 10)
టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త ఐజీఓ అసిస్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇది ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, ఐఎస్ జి కంట్రోలర్, అధిక పనితీరు కలిగిన బ్యాటరీని మిళితం చేస్తుంది, ఇది అధిక డిశ్చార్జ్ రేటును కలిగి ఉంటుంది. కొన్ని నిమిషాల్లో ఛార్జ్ చేయగలదు.
ఇతర గ్యాలరీలు