2023 Kia Seltos: 2023 కియా సెల్టోస్ ధర ఎంతో తెలుసా?.. కాంపిటీటివ్ ధర ప్రకటించిన కియా
Kia Seltos 2023: ఇటీవల లాంచ్ చేసిన 2023 మోడల్ సెల్టోస్ ధరను కియా సంస్థ ప్రకటించింది. ఈ ఎస్ యూవీ ఎక్స్ షో రూమ్ ధర రూ. 10.89 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇతర ఫీచర్స్ అండ్ అప్ డేట్స్ ఈ ఫొటోల్లో..
(1 / 7)
2023 మోడల్ సెల్టోస్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 10.89 లక్షల నుంచి ప్రారంభమవుతోందని కియా ప్రకటించింది.
(2 / 7)
2023 కియా సెల్టోస్ మొత్తం 8 రంగుల్లో లభిస్తుంది. ఇందులో రెండు డ్యుయల్ టోన్ కలర్స్. అలాగే, ఒక ఎక్స్ క్లూజివ్ మాటీ గ్రాఫైట్ కలర్ వేరియంట్ కూడా ఉంది.
(3 / 7)
2023 మోడల్ సెల్టోస్ లో గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్, బంపర్, స్కిడ్ ప్లేట్ లను రీ డిజైన్ చేశారు. వెనుకవైపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ తో లైట్ బార్ ను డిజైన్ చేశారు.
(4 / 7)
2023 మోడల్ సెల్టోస్ లో 18 ఇంచ్ ల క్రిస్టల్ కట్ గ్లాసీ బ్లాక్ అలాయ్ వీల్స్ ను ఏర్పాటు చేశారు. రియర్ బంపర్ తో పాటు డ్యుయల్ ఎగ్జాస్ట్ టిప్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ ను ఏర్పాటు చేశారు.
(5 / 7)
క్యాబిన్ లో 10.25 ఇంచ్ ల ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, 10.25 ఇంచ్ ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కన్సోల్ ఉంటాయి.
(6 / 7)
అడ్వాన్సడ్ అలెక్సా పవర్డ్ స్మార్ట్ హోం కనెక్ట్ అనే కొత్త ఫీచర్ 2023 సెల్టోస్ లో ఉంది. ఇంకా, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 8 రకాలుగా ఎడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీట్.. మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు