Delhi rain: తెరిపి లేని వానతో తడిసి ముద్దైన రాజధాని నగరం
- దేశ రాజధాని ఢిల్లీని వానలు వదలడం లేదు. బుధవారం సాయంత్రం నుంచి నగరంలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది.
- దేశ రాజధాని ఢిల్లీని వానలు వదలడం లేదు. బుధవారం సాయంత్రం నుంచి నగరంలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది.
(1 / 7)
ఢిల్లీ-ఎన్సీఆర్లో అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రోజువారీ కార్మికులు ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలో గంట వ్యవధిలో 50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.((Photo by Sunil Ghosh / Hindustan Times))
(2 / 7)
ఢిల్లీ-ఎన్సిఆర్లో అకస్మాత్తుగా ప్రారంభమైన వర్షం వాహనదారులను ఇబ్బందుల పాలు చేసింది. రాత్రి 8.30 గంటల తర్వాత వర్షం తీవ్రత తగ్గింది. కానీ, పలు ప్రాంతాల్లో తెల్లవారు జామున 3 గంటల వరకు చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.((Photo by Sunil Ghosh / Hindustan Times))
(3 / 7)
బుధవారం సాయంత్రం గంటపాటు కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకస్మాత్తుగా వర్షం ప్రారంభం కావడం, అది ఆఫీస్ ల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.((Photo by Sunil Ghosh / Hindustan Times))
(4 / 7)
భారీ వర్షం కారణంగా ఢిల్లీ-నోయిడా ఫ్లైవేలోని పలు స్ట్రెచ్ లలో ట్రాఫిక్ జామ్ అయింది. విమానాశ్రయానికి వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది.((Photo by Sunil Ghosh / Hindustan Times))
(5 / 7)
ముఖ్యంగా గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ వెళ్లే రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. కన్నాట్ ప్లేస్ కారిడార్లతో పాటు కొత్త పార్లమెంటు వెలుపల నీట మునిగిన రహదారి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.((Photo by Sunil Ghosh / Hindustan Times))
(6 / 7)
గురుగ్రామ్ లోని బెరివాలా బాగ్ రోడ్ సెక్టార్-11 వద్ద భారీ వర్షానికి వాహనాలు నీట మునిగాయి. లోధి కాలనీ, పాటియాలా హౌస్ కోర్టు, చాణక్యపురి, కాకా నగర్ తదితర ప్రాంతాల్లో కూడా నీరు నిలిచిపోయింది.((Photo by Parveen Kumar/Hindustan Times))
ఇతర గ్యాలరీలు