TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో అప్డేట్ - ఆ లిస్ట్ లో ఉంటే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రావొచ్చు!-important update about the indiramma housing scheme application lists ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో అప్డేట్ - ఆ లిస్ట్ లో ఉంటే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రావొచ్చు!

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో అప్డేట్ - ఆ లిస్ట్ లో ఉంటే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రావొచ్చు!

Published Feb 18, 2025 08:02 AM IST Maheshwaram Mahendra Chary
Published Feb 18, 2025 08:02 AM IST

  • ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులను 3 జాబితాలుగా విభజించగా.. ఎల్ 2 కేటగిరిలో ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాదాలపై కార్యాచరణను సిద్ధం చేయనుంది. 

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ స్కీమ్ కోసం భారీగా దరఖాస్తులు రాగా… సర్వే ద్వారా వివరాలను పరిశీలించిన సంగతి తెలిసిందే. అయితే వచ్చిన దరఖాస్తులను మూడు రకాలుగా విభజించింది.

(1 / 8)

సొంత జాగా ఉండి ఇళ్లు లేనివాళ్లను ఎల్ 1 కేటగిరిలో ఉంచగా… ఇక సొంత స్థలం లేనివారని ఎల్‌-2, సొంత ఇల్లు ఉండీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్‌-3లో చేర్చారు. అయితే ఎల్ 2 జాబితాలో ఉన్న వారి విషయంలో ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. 

(2 / 8)

ఎల్‌-2లో కేటగిరిలో 19 లక్షలకుపైగా దరఖాస్తులు చేసుకున్నవారు ఉన్నారు. ప్రభుత్వం ముందు చెప్పిన ప్రకటన ప్రకారం… వీరికి ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం కూడా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అర్హత ఉన్న వారి పేర్లను గుర్తించగా… లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. 

(3 / 8)

గత ప్రభుత్వ హయాంలో చాలా నియోజకవర్గాల్లోనూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. వీటిని కొన్నింటిని పంపిణీ చేయకుండా ఉంచారు. ఈ నేపథ్యంలో…. ఎల్ 2 జాబితాలో ఉన్న లబ్ధిదారులను గుర్తించటంతో పాటు… అర్హత ఉన్న వారికి  రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది,

(4 / 8)

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 2.36 లక్షల రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయగా….. ఇందులో 1.58 లక్షల ఇళ్లను పూర్తి చేసింది. వీటిలోనూ 1.36 లక్షల ఇళ్లను పంపిణీ చేసింది. మిగతావి అలానే ఉన్నాయి. మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వీటిని ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులను అందించాలని యోచిస్తోంది. 

(5 / 8)

నిర్మాణం పూర్తికాని వాటి విషయంలో సంబంధిత గుత్తేదారులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. సకాలంలో పెండింగ్ బిల్లులను చెల్లించటంతో పాటు ప్రస్తుతం జరగాల్సిన పనుల విషయంలోనూ రాయితీలు కల్పించాలని భావిస్తోంది. ఫలితంగా గుత్తేదారులు కూడా ముందుకొచ్చి… మిగిలిపోయిన నిర్మాణాలను త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని చూస్తోంది.

(6 / 8)

మొదటి దశలో సొంత జాగ ఉండి ఇళ్లు లేని వాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఫలితంగా ఎల్ 1 జాబితాలో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ దిశగానే లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. 

(7 / 8)

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నారు. త్వరలోనే అన్ని గ్రాామాల్లోనూ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వెబ్ సైట్ లోకి వెళ్లి వారి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు..

(8 / 8)

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు