తెలుగు న్యూస్ / ఫోటో /
TG Indiramma Housing Scheme : ఈ నెలాఖారులోగా ఇళ్ల మంజూరు..! ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ తాజా అప్డేట్ ఇదే..!
- Telangana Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ నెలాఖారులోగా ఇళ్ల మంజూరు ప్రక్రియ ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు. ఇప్పటికే 65 లక్షల మందికిపైగా వివరాలను యాప్ ద్వారా సేకరించినట్లు తెలిపారు.
- Telangana Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ నెలాఖారులోగా ఇళ్ల మంజూరు ప్రక్రియ ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు. ఇప్పటికే 65 లక్షల మందికిపైగా వివరాలను యాప్ ద్వారా సేకరించినట్లు తెలిపారు.
(1 / 10)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు వివరాలను సేకరిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో ప్రతిదీ ఎంట్రీ చేస్తున్నారు. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
(2 / 10)
ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గ్రామాలకు వెళ్లి మరీ వివరాలను ఎంట్రీ చేయించుకుంటన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన...ఈ నెలాఖారులోగా(జనవరి 31,2025) ఇళ్ల మంజూరు ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు. అత్యంత పాదర్శకంగా లబ్ధిదారులను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు.
(3 / 10)
ప్రజా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇంటింటికి సర్వే నిర్వహించి ఇప్పటికే 65 లక్షల మంది వివరాలను యాప్ ద్వారా సేకరించామన్నారు.
(4 / 10)
గతంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను అర్హులకు కేటాయించి తలుపులు, మరమ్మతులకు అయిన ఖర్చు కూడా చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎటువంటి పైరవీలు ఉండవన్నారు.
(5 / 10)
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రానున్న నాలుగేళ్లలో అర్హులందరికీ గృహాలను నిర్మించే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు.
(6 / 10)
గృహ నిర్మాణశాఖ సంబంధించి 2004 నుండి 2014 వరకు 25 లక్షల ఇల్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి ప్రస్తావించారు. గత ప్రభుత్వం గత 10 ఏళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని కలలు కలలుగానే ఉంచిందని విమర్శించారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల లో 80 లక్షల ఇళ్లను నిర్మించే లక్ష్యం గా పెట్టుకున్నామని ప్రకటించారు.
(7 / 10)
దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్క పేదవాడు కూడా అభద్రతకు లోను కావద్దని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. రాజకీయాలకతీతంగా నిరుపేదలకు ఇళ్లను అందిస్తామన్నారు.
(8 / 10)
ఇక గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో వీటి వడపోత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికను జోడించి… లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా సర్వే చేయిస్తోంది.(https://tshousing.cgg.gov.in/)
(9 / 10)
గ్రామ సభ ఆమోదం తర్వాతనే… ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు.ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది.
ఇతర గ్యాలరీలు