
(1 / 4)
తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఒడిశా ఉత్తర తీర ప్రాంతం నుంచి తెలంగాణ వరకు ఇంటీరియర్ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది.

(2 / 4)
గురువారం నాడు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు బుధవారం పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లో సాయంత్రం 4 తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.

(3 / 4)
ఏపీలో ఎక్కువగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలు ఉంటాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో మూడు రోజులు పాటు అంటే గురువారం, శుక్రవారం, శనివారం వరకు వానలు ఉంటాయని అంచనా వేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

(4 / 4)
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అయితే బుధవారం నాడు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇతర గ్యాలరీలు