TS AP Weather : తెలంగాణకు ఐఎండీ హెచ్చరికలు.. భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్-imd red alert for telangana forecasts heavy rain for next three days ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Ap Weather : తెలంగాణకు ఐఎండీ హెచ్చరికలు.. భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TS AP Weather : తెలంగాణకు ఐఎండీ హెచ్చరికలు.. భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Published Sep 02, 2023 06:36 AM IST Maheshwaram Mahendra Chary
Published Sep 02, 2023 06:36 AM IST

  • Telangana AP Weather Updates:తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని...ఈ ప్రభావంతో వానలు పడుతాయని అంచనా వేసింది.

(1 / 6)

(unsplash.com)

సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. 2, 3, 4 తేదీల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. 

(2 / 6)

(APSDMA)

ఇవాళ, రేపు... ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(3 / 6)

సెప్టెంబర్ 6, 7 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా తేదీల్లో ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు. 

(4 / 6)

ఇవాళ ఏపీలోని పార్వతీపురంమన్యం,అల్లూరి సీతారామరాజు,ఏలూరు,కృష్ణా, ప్రకాశం,తిరుపతి,చిత్తూరు, అన్నమయ్య,శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి  మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(5 / 6)

మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.  

(6 / 6)

ఇతర గ్యాలరీలు